English | Telugu

ఫేక్ లోన్ యాప్స్ నిర్వాకం.. సూసైడ్ చేసుకున్న నూకరాజు! కదిలించిన స్కిట్!!

'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఎప్పటిలాగే సరికొత్తగా అలరించడానికి సిద్దమయ్యింది. దీనికి సంబంధించి న్యూ ప్రోమో రిలీజ్ కూడా ఐపోయింది. ఈ వారం 'భాగ్యలక్ష్మి బంపర్ డ్రా'కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకు ఈ ఎపిసోడ్ రాబోతోంది. ఇందులోబుల్లితెర స్టార్స్ అంతా కూడా వెరైటీ గేమ్ ఆడారు. చిన్నప్పుడు పిల్లలంతా ఆడే సాక్ రేస్ ని వీళ్లంతా ఇప్పుడు "గోనెలో గెంతులు" పేరుతో ఆడి ఎంటర్టైన్ చేశారు.

ఇక ఈ షోకి చరణ్ అర్జున్ ని తీసుకురావడం, అతనితో "నువ్వో రాయి నేనో శిల్పి" సాంగ్ పాడించడం హైలైట్ అని చెప్పొచ్చు. ఆయన సాంగ్ పాడుతున్నంత సేపు ఇంద్రజ అలా తన్మయత్వంలోకి వెళ్ళిపోయింది. "అమ్మ ఒడిలో పడుకున్నాక బుజ్జగించినప్పుడు ఎలా ఉంటుందో అలా వుంది మీ పాట" అని కాంప్లిమెంట్ ఇచ్చేసింది. ఇక నూకరాజు, రాఘవ అందరూ కలిసి ఒక స్కిట్ ప్లే చేశారు. ఈమధ్య కాలంలో ఫేక్ లోన్ యాప్స్ కారణంగాఎంతోమంది సూసైడ్ చేసుకుని చనిపోయిన కాన్సెప్ట్ ని సెలెక్ట్ చేసుకుని ఈ స్కిట్ ని ఆద్యంతం రక్తి కట్టించారు.నూకరాజు సూసైడ్ చేసుకొన్న సీన్ అందరి హృదయాల్నీ కదిలించింది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.