English | Telugu

జబర్దస్త్ నరేష్ పెళ్లి చూపులు...వధువు ఎవరో తెలుసా!

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో చాలా ఫన్నీగా ఎమోషనల్ గా ఉంది. ఇక ఇందులో నాటీ నరేష్ పెళ్లిచూపులు జరిగాయి. బుల్లితెర మీద నాటీ నరేష్ అంటే తెలియని వారు లేరు. అతని హైట్ అతను చేసే కామెడీ ఫుల్ ఫన్నీగా ఉంటుంది. అలాంటి నరేష్ హైట్ మీద చాలామంది చాలా కామెంట్స్ చేస్తూ అసలు అతనికి పెళ్లవుతుందా అనేలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఐతే ఇప్పుడు నిజంగా ఆ ఘట్టం వచ్చిందంటూ ఆది చెప్పుకొచ్చాడు. "మా అందరికీ ఒక ఫామిలీ తరపున ఒక మెసేజ్ వచ్చింది. ఇలా నాటీ నరేష్ ని పెళ్లి చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము తనకు ఒకే అంటే ఆ పెళ్లి చూపులేదో చేద్దాం...ఆ ఫామిలీ కూడా ఈ సెట్ కి వచ్చారు" అంటూ ఆది ఆ ఫామిలీని పరిచయం చేసాడు ఆది. పెళ్లి చేసుకోబోయే పిల్ల పేరు నవ్య. ఐతే నవ్య - నరేష్. అక్కడే పేర్లు కూడా కలిసిపోయాయి అని చెప్తూ ఆది నరేష్ ని ముద్దు పెట్టేసుకున్నాడు.

ఇక నవ్య మాట్లాడుతూ "నువ్వంటే నాకు చాలా ఇష్టం. అందుకే అంత దూరం ఇక్కడి వరకు వచ్చా. లవ్ యు. లవ్ యు ఫర్ ఎవర్" అని చెప్పింది. ఇక నరేష్ కూడా "నాకు కూడా మీరు బాగా నచ్చారు" అని సిగ్గుపడిపోతూ చెప్పాడు. తర్వాత సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ఈ షోకి గెస్ట్ గా వచ్చారు. ఆమె కూడా నవ్యని ఒక ప్రశ్న వేశారు."ఏమ్మా నువ్వు డిగ్రీ పాసయ్యాక ఉద్యోగానికి పోతావా" అంది. "నరేష్ కి ఏది ఇష్టమైతే అదే నాకు ఇష్టం" అని చెప్పింది నవ్య. ఇక నాటీ నరేష్ వాళ్ళ నాన్న రెగ్యులర్ గా స్కిట్స్ లో కనిపిస్తూ తాగుబోతు క్యారెక్టర్స్ చేస్తూ ఫన్ చేస్తూ ఉంటాడు. అలాగే ఆయన ఈ ప్రోమోలో ఏడుస్తూ కనిపించాడు. "నరేష్ వాళ్ళ నాన్న ఏడుస్తుండే" అంటూ కొమరక్కా చెప్పేసరికి ఆయన కళ్ళు తుడుచుకుని "కొంతమంది నరేష్ పెళ్లవుతుందో కాదో అని చెప్తూ ఎగతాళి చేసేవాళ్ళు ఆ మాటలకు నాకు బాధగా అనిపించేది" అనేసరికి ఆది వాళ్ళ నాన్న కన్నీళ్లు తుడిచాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.