English | Telugu

అలాంటి అమ్మాయి కావాలి నాకు!

ఢీ-14 డాన్సింగ్ ఐకాన్ సెమీఫైనల్స్ పూర్తి చేసుకుంది. ఇక ఈ వారం ప్రసారమైన ఈ షో ఆద్యంతం నవ్వులు పూయించింది. డాన్స్ పెర్ఫార్మెన్సెస్ కూడా అలరించాయి..

ఇక ఆది ఈ షోలో తనకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పాడు. "పూజ హెగ్డే లాంటి ఫేస్ ఉండాలి, రష్మిక స్ట్రక్చర్ ఉండాలి, అనుష్క అంత హైట్ , మాట్లాడే విధానం చూస్తే ఈ అమ్మాయిని తొందరగా పెళ్లి చేసేసుకోవాలి అనే విధంగా ఉండాలి అంటే వాయిస్ కాజల్ లా ఉండాలి, డ్రెస్సింగ్ వచ్చేసరికి చాలా మోడరన్ గా ఉండాలి ఎలా అంటే బిల్లా మూవీలో అనుష్క బికినీ వేస్తుంది కదా అలా ఉండాలి" అని హైపర్ ఆది అనేసరికి ప్రదీప్ మాట్లాడుతూ " నేను ఆదిని చూసినప్పుడు అతను చాలా స్లో, ఒక అమ్మాయిని ఇష్టపడతాడు, పెళ్లి చేసుకుంటాడు అనుకున్నా..కానీ ఇప్పుడు ఇన్ని క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి అని చెప్పాక అతనికి నచ్చిన క్వాలిటీస్ ఉన్నవాళ్లు రారు, అలాంటి వాళ్ళు లేరు, ఇక ఉండరు" అన్నాడు.. "ఫస్ట్ టైం మంచి జోక్ వేసి ఆది ఎంటర్టైన్ చేసాడు" అని పూర్ణ సెటైర్ వేసేసరికి " ఆదికి బాగా మండింది. " ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే నాకు పూర్ణ గారిలాంటి అమ్మాయి కావాలి' అని క్రీం బిస్కెట్ వేసాడు.

ఇక ఢీ- 14 డాన్సింగ్ ఐకాన్ నుంచి జోడీస్ టీమ్ నుంచి సాగర్ - రిషిక గ్రాండ్ ఫినాలేకి వెళ్లారు. ఇక జూనియర్స్ టీమ్ నుంచి మహాలక్ష్మి - కిస్సి ఈ ఇద్దరికి వచ్చిన స్కోర్ సమానంగా ఉండేసరికి టై అయ్యింది. గ్రాండ్ ఫినాలేకి ఈ ఇద్దరిలో ఒక్కరే వెళ్ళాలి కాబట్టి నెక్స్ట్ వీక్ నిర్వహించే షూటౌట్ రౌండ్ లో ఎవరు బాగా పెర్ఫార్మ్ చేస్తారో వాళ్ళే గ్రాండ్ ఫినాలేకి వెళ్తారని జడ్జెస్ అనౌన్స్ చేశారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.