English | Telugu

అందరినీ ఆకర్షిస్తున్న ఏఐ వెర్షన్ జబర్దస్త్ ప్రోమో

జబర్దస్త్ షో నెక్స్ట్ వీక్ నుంచి సరికొత్త ఎంటర్టైన్మెంట్ తో రాబోతోంది అన్న విషయం తెలిసిందే . ఈ ఎపిసోడ్ ఏఐ వెర్షన్ ప్రోమో అందరినీ అలరిస్తోంది. ఈ మధ్య ఎంత పెద్దవాళ్ళనైనా ఏఐలో చిన్న చిన్న పిల్లల్లా మర్చి వీడియోస్ ని రిలీజ్ చేయడం చూస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రోమో కూడా అలాగే వచ్చింది. జడ్జ్ గా కృష్ణ భగవాన్ మళ్ళీ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. ఖుష్బూ శివగామిగా, కృష్ణ భగవాన్ బిజ్జల దేవుడుగా కనిపించారు. "జబర్దస్త్ రాజ్యంలోని ప్రజలందరికీ నమస్కారం..ఏవండీ మన రాజ్యం ఎలా ఉంది" అని బిజ్జల దేవుడిని అడిగింది శివగామి. "రాజ్యంలో ప్రజలందరూ బాగున్నారు. డబ్బు, ఆహారానికి కొదువ లేదు. ఆనందమే కొంచెం ఎక్కువ కావాలనుకుంటున్నాడు" అని చెప్పాడు. రాఘవ కట్టప్పగా వచ్చాడు. "జబర్దస్త్ రాజ్యానికి మకిలి పట్టింది. కామెడీతో కడిగెయ్ కట్టప్ప..ఇదే నా మాట నా మాటే శాసనం..ఇక్కడ కామెడీ చేసిన వాళ్ళే శాశ్వతం " అని ఆజ్ఞ ఇచ్చింది. దాంతో రాఘవ ట్రిపుల్ ఆర్ లను పిలిచాడు. "రామ్ గా సద్దాం, భీం గా యాదమ్మ రాజు" వచ్చారు. "ఇక నుంచి మీ కామెడీలో టైమింగ్ బాగుండాలి..కామెడీ పెరగాలి" అని చెప్పింది ఖుష్భూ..."అడవి మనిషిని తల్లి..అర్ధం కాలేదు" అంటూ యాదమ్మ రాజు పెద్ద కామెడీ డైలాగ్ వేసాడు. దేవరాగా ఆటో రాంప్రసాద్ వచ్చాడు. "ఇప్పుడేటి కామెడీ బాగుండాలి అంతే కదా..ఈ దేవర చెప్పాడంటే చేస్తాడని అర్ధం" అన్నాడు. నూకరాజు పుష్ప గెటప్ లో , షెకావత్ గెటప్ లో బులెట్ భాస్కర్, భట్టు గెటప్ లో రాకింగ్ రాకేష్, చారీ గెటప్ లో ప్రవీణ్ వచ్చారు. "ఒరేయ్ ప్రవీణ ఇంతమందిని చూసేసరికి నా గుండేమిట్రా ఇంతలా వణుకుతోంది" అన్నాడు రాకేష్. "ఏముంది గురువుగారు కొత్తగా కామెడీ చేయమంటున్నారుగా గుండె కాదు ఇక నుంచి అన్నీ వణుకుతాయి" అన్నాడు ప్రవీణ్.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.