English | Telugu

ఓంకార్ కాళ్ళ మీద పడిన అమర్

ఇష్మార్ట్ జోడి సీజన్ 3 ఆదివారం ఎపిసోడ్ ఫుల్ జోష్ తో సాగింది. ఇక గ్రాండ్ ఫినాలేకి కొన్ని జోడీస్ సెలెక్ట్ అయ్యాయి. అమర్ - తేజు, ప్రదీప్ - సరస్వతి, ఆదిరెడ్డి - కవిత, రాకేష్ - సుజాత, ప్రేరణ - శ్రీపధ్, సోనియా - యష్ జంటలు గ్రాండ్ ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చాయి. ఇందులో లాస్య-మంజునాథ్, అభయ్ - భవాని ఓడిపోయారు. ఐతే అపోజిట్ టీమ్ వాళ్ళు గెలిచి సెలబ్రేషన్ చేసుకుంటూ ఉండగా అమర్ ఫుల్ ఫైర్ అయ్యాడు.

గెలిచినప్పుడే కాదు ఓడిపోయినప్పుడు వాళ్లను చూసి పలకరించాలి అంటూ మండిపడ్డాడు. దానికి యాంకర్ ఓంకార్ కూడా ఫుల్ ఫైర్ అయ్యాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం గట్టిగానే జరిగింది. "అందరూ రండి అన్నప్పుడు నువ్వు ఓడిపోయిన వాళ్ళ దగ్గరకు వెళ్లకుండా ఆదిరెడ్డి బాగా ఆడాడు అంటూ ఎందుకు అతని దగ్గరకు వెళ్ళావ్ మరి" అంటూ ఓంకార్ అడిగాడు. "ఇండియా వాళ్ళు గెలిచినప్పుడు వెళ్లి పాకిస్తాన్ వాళ్ళను కావలించుకుంటామా మన ప్లేయర్స్ ని కావలించుకుంటామా" అంటూ సీనియర్ నటుడు ప్రదీప్ కూడా అమర్ మీద ఫైర్ అయ్యాడు. తర్వాత ఎదురుగా ఉన్న ఆడియన్స్ చప్పట్లు కొడుతున్నా కూడా "కొట్టు కొట్టు కొట్టు" అంటూ అమర్ కొంచెం ఎక్కువగానే రియాక్ట్ అయ్యాడు. దాంతో ఓంకార్ కూడా "ఏమిటి అమర్ వాళ్ళను సెలెబ్రేట్ చేసుకోవద్దు అంటావ్, అభిమానులను క్లాప్స్ కొట్టద్దు అంటావ్..మరి ఎం చేయాలి...మీరు ఒక స్ట్రాటజీతో ఉన్నారు " అని అడిగాడు. "అన్నా ఈశ్వరుడి మీద ఒట్టేసి చెప్తున్నా ఏ స్ట్రాటజీ లేదు అన్నా..." అన్నాడు అమర్.."ఎవరి సెలబ్రేషన్ ని ఆపే హక్కు నాతో సహా ఎవరికీ లేదు...ఇష్మార్ట్ జోడిలో లాస్ట్ లో ఇలా ప్రీ-ఫైనల్ లో ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. నాకే బాధగా ఉంది. ఇలా మాట్లాడుకుంటామని అనుకోలేదు. నేను కూడా నీ వల్ల ఈరోజు కోప్పడాల్సి వచ్చింది. నేను కోపాన్ని ఎవరి మీద చూపించలేదు..తప్పు చేస్తే నేను తట్టుకోలేను..అందులోనూ నా తమ్ముడి లాంటి అమర్ తప్పు చేసాడని అరిచాను...నేను తప్పు చేసి ఉంటే నన్ను కూడా క్షమించు" అన్నాడు ఓంకార్. వెంటనే అమర్ వెళ్లి "అన్నా ఊరుకో..ఇంత దూరం తీసుకొచ్చింది నువ్వు...తిట్టినా, కొట్టినా నువ్వే ..ప్రేమగా ఉండేది నువ్వు, ప్రేమగా మాట్లాడేది నువ్వే" అంటూ ఓంకార్ కాళ్ళ మీద పడ్డాడు. ప్రదీప్ గారు అమర్ మనవాడు రండి అందరూ కలిసి మాట్లాడుకోండి అంటూ ఓంకార్ అందరినీ కలిపేసాడు. ఈ గొడవ కూడా ఒకందుకు మంచిదే...ఇలా ఎన్ని గొడవలు వచ్చినా బంధం తెగేవరకు లాక్కోకూడదు..అంటూ చెప్పాడు ఓంకార్. ఎవరో ఒకరు తగ్గి క్షమాపణ అడిగితే ఆ ప్రేమ మళ్ళీ కొనసాగుతుంది అంటూ చెప్పాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.