English | Telugu

చిరంజీవి, ఏఆర్ రెహ్మాన్, చిత్రమ్మకు క్షమాపణలు చెప్పిన రాకేష్....


ఇష్మార్ట్ జోడి సీజన్ 3 నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఐతే ఈ ప్రోమో మొత్తం కూడా రాకేష్ కబ్జా చేసేసాడు. అత్తా-కోడళ్ళు అదేనండి రాకేష్ వాళ్ళ అమ్మ - భార్య సుజాత కలిసి రాకేష్ ని టార్చెర్ పెట్టారు. దాంతో చిరంజీవికి, సారీ చెప్పాల్సి వచ్చింది. అదేంటో చూద్దాం...రాకేష్ వాళ్ళ అమ్మ స్టేజి మీద వచ్చి చిరు సాంగ్ "దాయి దాయి దామ్మా"కి డాన్స్ చేసారు. దాంతో రాకేష్ ఆపండి అంటూ అరిచాడు. "చిరంజీవి గారు క్షమించాలి..మా ఫ్యామిలీ మీకు తెలుసు. ఎన్నోసార్లు మీ దగ్గరకు వచ్చి బ్లేసింగ్స్ తీసుకున్నా..మళ్ళీ వచ్చి తీసుకుంటా." అన్నాడు..తర్వాత సుజాత మాములుగా ఏడిపించలేదు. రోజా మూవీ నుంచి "నా చెలి రోజావే" సాంగ్ కి ముందు వచ్చే గాత్రాన్ని ఇమిటేట్ చేయమని సుజాతకు ఓంకార్ చెప్పేసరికి రాకేష్ షాకయ్యాడు.

వెంటనే నిలబడి "ఏఆర్ రెహ్మాన్ సర్ ..నేను మీకు తెలీదు. ఇలాంటి తప్పు మళ్ళీ జరక్కుండా చూసుకోవడానికి మాక్స్ ట్రై చేస్తున్నా సర్ ..చిత్రమ్మా నేను మీకు తెలుసు. అమ్మా నేను నీ కొడుకు లాంటి వాడిని.. మీ కోడలు ఇంత దారుణం చేస్తుంటే చూడలేకపోయానమ్మా " అంటూ అందరికీ క్షమాపణలు చెప్పుకుంటూ వచ్చాడు. ఇక రాకేష్ చెప్పిన ఫన్నీ క్షమాపణలకు అందరూ నవ్వేశారు. ఇక ఈ గ్రాండ్ ఫినాలేలో పార్టిసిపేట్ చేసిన జోడీస్ అందరికీ రకరకాల టాస్కులు ఇచ్చాడు ఓంకార్. ఇక అమర్ మాట్లాడుతూ "ఇష్మార్ట్ జోడి ఈజ్ ది బెస్ట్ ఇన్ మై లైఫ్ ..ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ ఫామిలీ మెంబర్స్ ఐ లవ్ యు ఆల్" అంటూ అరిచి మరీ గట్టిగా చెప్పాడు. తర్వాత సీనియర్ నటుడు ప్రదీప్ కూడా మాట్లాడారు "36 ఏళ్ళ నుంచి ప్రేమ ఉంటుంది కాబట్టి టెక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా ఉంటాం. నా భార్యే కదా అర్ధం చేసుకుంటుందిలే అనుకుంటాం. ఇలాంటి వేదిక ఉంటే ఐ లవ్ యు సరస్ "అని చెప్పడం ఆనందంగా ఉంది అని చెప్పారు.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.