English | Telugu

ఊటీలో ఇనయా సుల్తానా హాట్ షో!

బుల్లితెర తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది బిగ్ బాస్. ఇక బిగ్ బాస్ సీజన్-6 ప్రేక్షకులకు ఎంతగానో వినోదాన్ని పంచిన విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్ -6లో అందరికి గుర్తుండిపోయేవాళ్ళు కొందరే ఉన్నారు. అందులో ఇనయా సుల్తానా ముజిబుర్ రహమాన్ ఒకరు. తన స్ట్రాటజీతో పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఇనయా.

బిగ్ బాస్ కి ముందు ఆర్జీవీతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుంది ఇనయా. ఆ తర్వాత బిగ్ బాస్ లో అవకాశం లభించింది. షోలోకి వెళ్ళాక.. టాస్క్ లలో తను బాయ్స్ ని డిఫెండ్ చేసిన తీరుకి సోషల్ మీడీయాలో ట్రెండింగ్ లోకి వచ్చింది ఇనయా. అలా‌ ఇనయా బిగ్ బాస్ షోలో ఉండి మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. అయితే ఇనయా సుల్తానా బిగ్ బాస్ షో తర్వాత బిజీ అయిపోయింది. సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ని పెట్టింది.‌ అందులో కుకింగ్ వీడియోలని, ఇంకా షాపింగ్ , జర్నీ వీడియోలంటూ అప్లోడ్ చేస్తూ బిజీ అయిపోయింది. కాగా తన ఫోటోలని అప్లోడ్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంది. రీసెంట్ గా ఒక కారు కూడా కొన్న ఇనయా.. గత వారం ఐకియా నుండి ఫర్నీచర్ ని ఆర్డర్ చేసి.. వాటి అన్ బాక్స్ చేసి చూపించింది. అయితే తన గురించి ప్రతీ విషయాన్ని అభిమానులకు తెలియాజేయాలనే ఉద్దేశంతో.. ప్రతీ అప్డేట్ ని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ వస్తోంది ఇనయా.

అయితే గతవారం తన‌కొత్త మూవీ అప్డేడ్ గురించి చెప్పింది ఇనయా. తను అంతకంటే ముందే మూడు సినిమాలలో నటించిందని చెప్పింది. కాగా బుల్లితెర సెలబ్రిటీలు కొందరు సమ్మర్ వెకేషన్ కోసం ఊటి, కొడైకెనాల్, సిమ్లా అంటూ వెళ్తున్నారు. ఇదే కోవలోకి ఇప్పుడు ఇనయా చేరిపోయింది. తాజాగా ఇనయా తన ఇన్ స్టాగ్రామ్ లో సమ్మర్ వెకేషన్ టు ఊటీ అంటూ కొన్ని ఫోటోలని షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఇనయా హాట్ డ్రెస్సింగ్ తో వీక్షకులను ఆకట్టుకుంటుంది. అందాల ఆరబోతలో తనేం తక్కువ కాదని భావించిన ఇనయా.. హాట్ ఫోటోస్ తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.