English | Telugu
Illu illalu pillalu : కొడుకుని గాయాలతో చూసి తల్లడిల్లిన తల్లి.. అది చేసిందెవరో ప్రేమ చెప్పనుందా!
Updated : Jan 31, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -70 లో.... చిన్నోడు, ప్రేమ ఇంకా ఇంటికి రాలేదని ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడతారు. వాడు ఎప్పుడు అంతే నా పరువు తీసే పనులే చేస్తాడు.. ఇప్పుడు కూడా నా పరువు తీసాడని ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నాడోనని రామరాజు అంటాడు. చిన్నోడు ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తాడని వేదవతి అంటుంది. వస్తాడులే గాని లోపలికి వెళ్ళండి అందరు అని రామరాజు అంటాడు.
ధీరజ్ ని హాస్పిటల్ కి తీసుకొని వస్తుంది ప్రేమ. బానే ఉన్నాడు రేపు డిశ్చార్జ్ చేస్తామని అక్కడి డాక్టర్ చెప్తాడు. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. వాళ్ళ నంబర్ నా దగ్గర లేదని దీరజ్ ఫోన్ నుండి సాగర్ కి ఫోన్ చేస్తుంది ప్రేమ. దాంతో నర్మదకి చెప్పకుండా చందుని తీసుకొని హాస్పిటల్ కి వస్తాడు సాగర్. ధీరజ్ ని ఆ పరిస్థితిలో చూసి అన్నలు ఇద్దరు ఎమోషనల్ అవుతారు. ఎవర్రా నిన్ను కొట్టిందని చందు అడుగగా.. ఏమో అన్నయ్య వాళ్ళని చూడలేదని ధీరజ్ అంటాడు కానీ ప్రేమ మాత్రం మా అన్నయ్య విశ్వక్ అని చెప్పగానే.. వాళ్ళు షాక్ అవుతారు. వాడి సంగతి చెప్తామంటూ ఆవేశపడుతుంటే వద్దని ధీరజ్ సముదాయిస్తాడు.
నర్మద ఏం జరిగిందోనని టెన్షన్ పడుతుంది. సాగర్ కి ఫోన్ చెయ్యడంతో విశ్వక్ ఎటాక్ చేసాడని చెప్తాడు. మరుసటి రోజు ఉదయం ధీరజ్ ని తీసుకొని ఇంటికి వస్తారు. ధీరజ్ ని దెబ్బలతో చూసి అందరు షాక్ అవుతారు. వేదవతి ఏడుస్తూ నా కొడుకుని ఎవరు కొట్టారంటూ ఎమోషనల్ అవుతుంది. అందరు సైలెంట్ గా ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.