English | Telugu

Illu illalu pillalu : అత్తగారింట్లో అడ్డంగా దొరికిపోయిన శ్రీవల్లి.. భాగ్యం ఏం చేయనుంది?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -197 లో... ఊళ్లో దొంగలు పడ్డారని తిరుపతి వచ్చి రామరాజుతో చెప్పేసరికి ఇంట్లో ఉన్న నగలు, డబ్బు బ్యాంకులో పెట్టమని రామరాజు చెప్తాడు. దాంతో శ్రీవల్లిని నగలు తీసుకురమ్మని చెప్తుంది వేదవతి. వేదవతి పిలుపు వినిపించేసరికి ఆ నగలకోసమే అయ్యి ఉంటుందని శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. అమ్మా వల్లీ అని వేదవతి ప్రేమగా పిలిచేసరికి.. చూశావా ప్రేమా.. అత్తయ్య గారికి ఆ అగ్గిపుల్ల కోడలంటే ఎంత ప్రేమో అని నర్మద అంటుంది. ఏయ్.. అగ్గిపుల్ల ఏంటే.. అగ్గిపుల్లా.. చిన్న పెద్ద తేడా తెలియకుండా అని వేదవతి అంటుంది. హా.. ఆ పేరు ఆవిడగారికి సరిగ్గా సరిపోతుందని ప్రేమ అంటుంది. ఏంటే.. దీనితో ఉండి నువ్వు కూడా దానిలాగే తయారయ్యావని వేదవతి అంటుంది.

ఇంతలో అగ్గిపుల్ల కోడలు.. చేతులు నలుపుకుంటూ వస్తుంది. ఏంటి అత్తయ్య గారూ పిలిచారా అని శ్రీవల్లి అడుగుతుంది. ఏం లేదమ్మా.. ఊరిలో దొంగలు పడ్డారంట.. మనందరి నగలు లాకర్‌లో పెట్టమని మీ మామయ్య గారు చెప్పారు. మీరు వెళ్లి మీ నగల్ని తీసుకుని రండి అని వేదవతి అంటుంది. ఇద్దరు కోడళ్లు వెళ్తారు కానీ.. శ్రీవల్లి మాత్రం అతితెలివి ప్రదర్శించి నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అత్తయ్య గారూ.. లాకర్‌లో పెట్టడం ఎందుకు వేస్టూ అని అంటుంది. దొంగలు నీకంటే జాగ్రత్తగా ఉంటారు.. వెళ్లి చెప్పింది చెయ్ అని వేదవతి అంటుంది. అంటే అదీ అత్తయ్య గారండీ.. అన్ని నగల్ని లాకర్‌లో పెడితే ఫంక్షన్లకు ఏం వేసుకోవాలని శ్రీవల్లి అడుగుతుంది. అందరి నగలు పెడుతున్నాం కదా.. ఫంక్షన్ నీ ఒక్కదానికే రాదు కదా.. బ్యాంక్‌కి వెళ్లాలి తొందరగా వెళ్లి నగల్ని తీసుకునిరా అని వేదవతి అంటుంది. దాంతో చచ్చినట్టు నగలు తీసుకునిరావడానికి వెళ్తుంది శ్రీవల్లి.

ఈ నగల్ని బ్యాంక్‌లో పెడితే రోల్డ్ గోల్డ్‌వి అని తెలిసిపోతుంది.. ఏం చేయాల్రా దేవుడా అని తలపట్టుకుంటుంది. వెంటనే భాగ్యానికి ఫోన్ చేస్తుంది శ్రీవల్లి.. కొంపలు అంటుకుంటున్నాయే అమ్మా.. మా ఏరియాలో దొంగలు పడ్డారట. అందుకని అందరి నగల్ని లాకర్‌లో పెడుతున్నారు. అప్పుడు ఇవి రోల్డ్ గోల్డ్ నగలని తెలిసిపోతుంది. దీంతో పాటు పెళ్లి కోసం మనం ఆడిన నాటకాలన్నీ బయటపడిపోతాయి. నా కాపురం నిలువుగా కూలిపోతుంది. ఆయనంటే నాకు చచ్చేంత ప్రేమే.. ఆయన దూరం అయితే నేను బతకలేనే అని శ్రీవల్లి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.