English | Telugu

Illu illalu pillalu : ప్రేమలో రామరాజు కొడుకులు, కోడళ్ళు.. ధీరజ్, ప్రేమ తప్ప!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -196 లో.... ప్రేమ దగ్గరికి ధీరజ్ వచ్చి ప్రేమ ఎంతటి వారినైనా మార్చేస్తుందంటే ఏమో అనుకున్నాను కానీ ఇప్పుడు తెలుస్తుందని ధీరజ్ అంటాడు. కోపందీసి నాపై ఏమైనా ప్రేమ మొదలైందా అని ప్రేమ అడుగుతుంది. అంత లేదు నేను నడిపోడు గురించి చెప్తున్నాను.. వాడు వదినని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు కదా.. అన్నయ్య గవర్నమెంట్ జాబ్ చెయ్యడం.. తనకి ఇష్టమట అందుకే అన్నయ్య గవర్నమెంట్ జాబ్ చేస్తానని నాతో చెప్పాడని ప్రేమతో చెప్తాడు ధీరజ్.

మరొకవైపు ప్రేమ కోసం ధీరజ్ నైట్ డ్రైవింగ్ కి వెళ్తున్న విషయం నర్మదకి చెప్తాడు సాగర్. ఈ విషయం ఎవరికీ చెప్పకని నర్మద దగ్గర సాగర్ మాట తీసుకుంటాడు. మరొకవైపు అన్నయ్య గవర్నమెంట్ జాబ్ చేస్తానన్నా విషయం ఎవరికి చెప్పొద్దని ప్రేమ దగ్గర ధీరజ్ మాట తీసుకుంటాడు.

మరుసటిరోజు కిచెన్ లో ఉన్న నర్మద దగ్గరికి ప్రేమ వస్తుంది. మాటల్లో ధీరజ్ కి నువ్వంటే ఎంత ఇష్టం.. నీకోసం ఇలా కష్టపడుతున్నాడన్న విషయం ప్రేమకి చెప్తుంది నర్మద. అలాగే బావ ఎంత మంచోడు నీ కోసం గవర్నమెంట్ జాబ్ చెయ్యాలనుకుంటున్నాడని నర్మదతో ప్రేమ చెప్తుంది. ఆ మాట విన్న నర్మద హ్యాపీగా ఫీల్ అవుతుంది. తరువాయి భాగంలో సాగర్ వెనకాల నుండి వచ్చి హగ్ చేసుకుంటుంది నర్మద. తనని చూసిన శ్రీవల్లి.. చందు దగ్గరికి వచ్చి హగ్ చేసుకుంటుంది. అలా రామరాజుని వేదవతి హగ్ చేసుకుంటుంది. అందరిని చూసి ధీరజ్ దగ్గరికి వెళ్తుంది ప్రేమ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.