English | Telugu

Illu illalu pillalu : ధీరజ్, విశ్వ మధ్య గొడవ.. మొగుడికి సపోర్ట్ గా ప్రేమ!


స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -170 లో.... ధీరజ్ దగ్గరికి ప్రేమ వస్తుంది. నువ్వు మీ నాన్న అన్న మాటలకి ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసని ప్రేమ అంటుంది. నాన్న అన్న దాంట్లో కూడా నిజం ఉంది. ఎందుకంటే నాన్న కష్టపడి పైకి వచ్చాడు. అలా మేం కూడా వస్తేనే కదా మాకు గౌరవమని ధీరజ్ అంటాడు.

ఖచ్చితంగా నాకంటూ ఒక పేరు సంపాదించుకుంటా అని ధీరజ్ అంటాడు. దాంతో ప్రేమ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు సాగర్ ని వేరొక జాబ్ చూసుకోమని నర్మద చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళ అమ్మ భాగ్యానికి శ్రీవల్లి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తుంది. నేను చెప్పినట్లు చెయ్ అని భాగ్యం శ్రీవల్లి కి ఏదో చెప్తుంది. ఆ తర్వాత శ్రీవల్లి ఏడుస్తూ గదిలోకి వస్తుంది. ఏమైందని చందు అడుగుతాడు. మావయ్య కి ఫొటోస్ చూపించానని నర్మద నన్ను తిట్టిందని చందుతో చెప్తుంది శ్రీవల్లి.

మరుసటి రోజు రామరాజు మిల్ కి వెళ్ళడానికి రెడీ అవుతాడు. అప్పుడే ధీరజ్ కాలేజీ కి రెడీ అవుతాడు. బైక్ దగ్గరికి వచ్చేసరికి రామరాజు అన్న మాటలు గుర్తుచేసుకొని 'కీ' వేదవతికి ఇచ్చేసి నడుచుకుంటూ వెళ్తాడు. చూసారా మీరు అన్న మాటలకి వాడు ఎంత బాధ పడ్డాడోనని రామరాజుతో వేదవతి చెప్తుంది. నేను వాళ్ళకి బాధ్యత తెలియడానికే కదా అలా అన్నది అని రామారాజు అంటాడు. తరువాయి భాగంలో ధీరజ్ ఫుడ్ డెలివరీ కి వెళ్తాడు. అక్కడ ధీరజ్ ని విశ్వ అవమానిస్తుంటే అప్పుడే ప్రేమ వచ్చి విశ్వతో గొడవపడుతుంది. నీకు సంబంధం లేదని విశ్వ అంటుంటే.. ధీరజ్ నా మొగుడు అని ప్రేమ అంటుంది. అది విని ధీరజ్ ఆశ్చర్యంగా చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.