Read more!

English | Telugu

వాలెంటైన్స్ డే స్పెషల్....సడెన్‌గా చేతిలో మాత్రం బాబుని పెట్టొద్దు!

వాలెంటైన్స్ డే త్వరలో రాబోతోంది. ఇక బుల్లితెర ఈ వాలెంటైన్స్ డే సందర్భాన్ని పురస్కరించుకుని ఎన్నో కలర్ ఫుల్ షోస్ ని తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. నెక్స్ట్ వీక్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ ప్రోమో ఈ వాలెంటైన్స్ డే స్పెషల్ గా తీసుకొచ్చారు. "చెప్పు బుజ్జి కన్నా" అనే కాన్సెప్ట్ తో ఈ షో ప్రసారం కాబోతోంది. ఈ సందర్భంగా రష్మీని మళ్ళీ టార్గెట్ చేసాడు హైపర్ ఆది. "ఫెబ్ 14 కదా నేను ఒకళ్ళకి గట్టిగా ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను" అని రష్మీ అనేసరికి "నాకు ఇచ్చేయండి నేను వెళ్లి అతనికి ఇచ్చేస్తాను" అని ఆది అనేసరికి రష్మీ ఫన్నీ ఎక్స్ప్రెషన్ ఒకటి ఇచ్చింది. 

"ఇంతకు బాబుకేమన్నా గిఫ్ట్ ఇచ్చావా మరి..బాబుకి గిఫ్ట్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఏదో ఒక రోజు సడెన్గా బాబుని ఇవ్వడాలు వంటివి చేయద్దు " అన్నాడు ఆది. బుల్లితెరపై లవ్ ట్రాక్ తో బాగా పాపులారిటీ సంపాదించిన జంట ఏదీ అంటే ప్రతి ఒక్క ప్రేక్షకుడు చెప్పే మాట రష్మీ, సుధీర్ జోడి అని. జబర్దస్త్ లో మొదలైన వీరి ప్రేమ ప్రయాణం ఇక బుల్లితెరపై అన్ని చానల్స్ లో కూడా పాకి పోయింది అని చెప్పాలి. ఇక వీరిద్దరూ కలిసి ఒక్కసారి తెరపై కనిపించారు అంటే చాలు ప్రేక్షకులు ఎంతగానో మురిసిపోతూ ఉంటారు. వీరిద్దరూ నిజంగానే ప్రేమించుకుంటున్నారో లేదో తెలియదు. కానీ అభిమానులు మాత్రం వీరు నిజంగానే ప్రేమించుకుంటున్నారని గట్టిగా ఫిక్స్ అయ్యారు.బుల్లితెరపై లవ్ ట్రాక్ తో బాగా పాపులారిటీ సంపాదించిన జంట ఏదీ అంటే ప్రతి ఒక్క ప్రేక్షకుడు చెప్పే మాట రష్మీ, సుధీర్ జోడి అని. జబర్దస్త్ లో మొదలైన వీరి ప్రేమ ప్రయాణం ఇక బుల్లితెరపై అన్ని చానల్స్ లో కూడా పాకి పోయింది అని చెప్పాలి. ఇక వీరిద్దరూ కలిసి ఒక్కసారి తెరపై కనిపించారు అంటే చాలు ప్రేక్షకులు ఎంతగానో మురిసిపోతూ ఉంటారు. వీరిద్దరూ నిజంగానే ప్రేమించుకుంటున్నారో లేదో తెలియదు. కానీ అభిమానులు మాత్రం వీరు నిజంగానే ప్రేమించుకుంటున్నారని గట్టిగా ఫిక్స్ అయ్యారు. 

బుల్లితెరపై వేళ్ళ  లవ్ ట్రాక్ ఫుల్ ఫేమస్. వీరిద్దరూ కలిసి తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకులు మురిసిపోతూ ఉంటారు. అభిమానులు మాత్రం వీరు నిజంగానే ప్రేమించుకుంటున్నారని గట్టిగా ఫిక్స్ అయ్యారు. కొన్ని కారణాల వలన రష్మీ-సుధీర్ జోడి స్క్రీన్ మీద కనిపించడం మానేసింది. ఐనా సరే వీళ్ళ తోటి కమెడియన్స్ మాత్రం వీళ్ళను మాత్రం అస్సలు వదలడం లేదు. ఏ చిన్న సందర్భం దొరికిన వీళ్ళను బాగా వాడేస్తున్నారు. వీళ్ళ మీద సెటైర్స్ వేసి రేటింగ్ ని పెంచుకుంటున్నారు.