English | Telugu

అన్నయ్యా అన్నందుకు శ్రద్దా మీద ఆది ఫైర్!

ఢీ ఛాంపియన్ షిప్ బ్యాటిల్ సీజన్ 15 క్వార్టర్ ఫైనల్స్ మంచి రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ వారం కూడా కంటెస్టెంట్స్ పోటా పోటీగా డాన్స్ చేశారు. ఇందులో ఆది, శ్రద్దా మీదా ఫైర్ అయ్యాడు. "నీ కాళ్ళను పట్టుకు" సాంగ్ ని శ్రద్దా చాలా అద్భుతంగా పాడి వినిపించింది. దానికి ఫిదా ఐన ఆది వెంటనే "ఎందువల్ల నిను ప్రేమించానో" అంటూ పాడి సమాధానం ఇచ్చాడు. "ఇప్పటివరకు ఈ ఫుల్ సీజన్ లో మీకు ఏమీ చెప్పలేదు. కానీ ఇప్పుడు ఆ విషయం చెప్తాను. ఈ రోజు నుంచి ఆది నా అన్నయ్య.." అనేసరికి జెస్సి క్లాప్స్ కొట్టాడు. బ్యాక్ గ్రౌండ్ లో "అన్నయ్యా అన్నావంటే" అనే సిట్యుయేషనల్ సాంగ్ ని ప్లే చేశారు. "బయట నేను ఏదైతే అనుకుని వచ్చానో అదంతా వీళ్ళు మార్చేశారు" అని ఆది ఫీలయ్యాడు.

అది తట్టుకోలేక "ఎవరి దగ్గరైన ఫోన్ ఉంటే ఇవ్వండి ప్రియాకి కాల్ చేస్తాను"..."శేఖర్ మాష్టర్" అని ఆది పిలిచేసరికి "చెప్పు బామ్మర్ది" అన్నాడు శేఖర్ మాష్టర్. "ఫోన్ ఉంటే ఇవ్వండి ప్రియమణికి కాల్ చేస్తాను" అన్నాడు. "మరి దివ్య ఏమైపోతుంది" అంది శ్రద్దా. "దివ్య లేదు ఎం లేదు ముందు ప్రియమణి గారికి కాల్ చేయండి" అన్నాడు "ఫామిలీ మొత్తం ఇలా కలవడం ఎలా ఉంది" అని ప్రదీప్ అడిగేసరికి నాకు ఎలాంటి ఫ్యామిలీ లేదు నన్ను ఇలా వదిలేయండి" అన్నాడు. శ్రద్దా తన సీట్ లోంచి లేచి "ఆది..ఇది జస్ట్ కంటెంట్ మాత్రమే.." అనేసరికి సీరియస్ గా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు ఆది. "శ్రద్దా నువ్వు నన్ను టచ్ చేయొద్దు చాలా చిరాగ్గా ఉంది.. నా పక్కన కూర్చుంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అని చెప్పి నిజంగానే వెళ్ళిపోయాడు..ఆది అలా బయటికి వెళ్లి వేరే అమ్మాయిని తీసుకొచ్చి తన పక్కన సీట్ లో కూర్చోబెట్టాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.