English | Telugu
దొంగలకు వార్నింగ్ ఇచ్చిన హిమజ
Updated : Jul 23, 2022
సోషల్ మీడియా బాగా అందుబాటులోకి వచ్చాక బుల్లి తెర సెలెబ్రిటీస్ చాలామంది ఏ చిన్నదైనా సరే వీడియో చేసి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో, యూట్యూబ్ చానెల్స్ లో పోస్ట్ చేస్తున్నారు. స్ట్రీట్ ఫుడ్ పేరుతో, హోమ్ టూర్స్ పేరుతో, అన్ బాక్సింగ్ పేరుతో, స్పెషల్ వంటల పేరుతో ఎన్నో కొత్త కొత్త వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇటీవల హిమజ బిగ్ బాస్ కంటెస్టెంట్ తన కొత్త ఇంటికి సంబంధించి ఒక హోమ్ టూర్ చేసి తన యూట్యూబ్ ఛానల్ లో అప్ లోడ్ చేసింది. ఐతే తన సొంత ఇల్లు రేనోవేషన్ లో ఉంది కాబట్టి రెంటెడ్ హౌస్ లోకి మారిందట. ఐతే అభిమానుల కోరిక మేరకు ఆ రెంటెడ్ హౌస్ ని హోమ్ టూర్ చేసి ఫాన్స్ కోసం అందుబాటులో ఉంచింది.
సోషల్ మీడియా లేని రోజుల్లో అసలు సెలెబ్రిటీస్ ఇళ్ళు ఎలా ఉంటాయి, వాళ్ళు ఏమేం వాడుతూ ఉంటారు, వాళ్ళ కిచెన్ , గార్డెన్ ఎలా ఉంటుంది అనే సందేహాలు సాధారణ జనాల్లో చాలా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ ప్రశ్నలన్నిటికీ బ్రేక్ వేస్తూ ఏ సెలెబ్రిటీ హౌస్ చూడాలన్నా సరే ఇట్టే చూసేయొచ్చు. ఎందుకంటే సెలెబ్రిటీ పేరుతో హోమ్ టూర్ అని గూగుల్ సెర్చ్ లో టైపు చేస్తే చాలు ఆ వీడియో వచ్చేస్తుంది. ఐతే హిమజ తాను ఉన్న ఇంటిని బాగు చేయించి అమ్మేద్దామనుకుంటున్నట్టు ఈ వీడియో లో చెప్పింది. అందుకే ఈ హౌస్ కి షిఫ్ట్ ఐనట్లు చెప్పుకొచ్చింది. తన రెంట్ హౌస్ లో పెంపుడు కుక్కల్ని చూపించింది, లివింగ్ రూమ్ ని, బెదురూమ్ ని, సర్దుకున్న కొన్ని సామాన్లను చూపించింది. అలాగే తన జ్యువెలరీని పెట్టుకుని అల్మారా చూపించింది. జ్యువెలరీ అనగానే దొంగలంతా రెడీ ఐపోతారేమో వచ్చేద్దామని అదంతా వన్ గ్రామ్ గోల్డ్ అంటూ పంచ్ వేసింది హిమజ. ఇక తన మేకప్ కిట్స్, బాల్కనీ వ్యూ, టీవీ, కిచెన్ చూపించేసింది హిమజ.