English | Telugu

కొండచిలువతో కబుర్లు చెప్తున్న రిషి సర్!

ముఖేష్ గౌడ కంటే రిషి సర్ అంటేనే ఆయన ఆటిట్యూడ్ కి సరిగ్గా సూటవుతుందేమో. "గుప్పెడంత మనసు" సీరియల్ లో రిషి క్యారెక్టర్ మంచి హుషారుగా ఉంటుంది. వసుధారతో చేసే సైలెంట్ రొమాన్స్ మాములుగా ఉండదు. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఫాన్స్ ఉన్నారు అని అడిగితే రిషి సర్ కే అని చెప్పొచ్చు. అలాంటి రిషికి ప్రకృతి అన్నా అందులో జీవించే జంతువులన్నా చాలా ఇష్టం. ఇదే కాదు మంచి దైవ భక్తుడు కూడా. దేవాలయాలకు వెళ్తాడు అలాగే జూకి, పార్క్స్ కి వెళ్లి మస్త్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆ ఫొటోస్ ని వీడియోస్ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేస్తూ ఉంటాడు. అలాగే ఇప్పుడు కూడా ఒక జూకి వెళ్ళాడు.

అక్కడ గ్రీన్ కొండచిలువను మెడలో వేసుకుని దాంతో నవ్వుతూ, మాట్లాడుతున్నట్టు తెగ పోజులిచ్చాడు...తర్వాత ఉడుమును ఒడిలో కూర్చోబెట్టుకుని ఎంజాయ్ చేసాడు. తన మేనల్లుడు విహాన్ ని కూడా తనతో తీసుకెళ్లడంతో ఆ పిల్లాడు కూడా ఫుల్ ఎంజాయ్ చేసాడు. దీనికి సంబంధించిన పిక్స్ ని తన ఇన్స్టా పేజీలో పోస్ట్ చేసుకుని నెటిజన్స్, ఫాన్స్ ఫుల్ ఖుషీ ఐపోయి కామెంట్స్ చేస్తున్నారు. " మామా అల్లుళ్ళు ఇద్దరూ ధైర్యవంతులై...మీరు చాలా మంచి ప్రకృతి ప్రేమికులు...రిషి సర్ మీకు ఎంత ధైర్యం ఉన్నా చూడడానికి మాకు భయం వేస్తోంది...మెడలో పామును వేసుకుంటే అచ్చం శివుడిలా ఉన్నారు..కానీ పక్కన పార్వతి మిస్సింగ్. స్నేక్ మహారాజు, జెంటిల్మెన్ ముకేష్ సర్" అంటూ క్యూట్ కామెంట్స్ ని పోస్ట్ చేస్తున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.