English | Telugu
Guppedantha Manasu : వారిపై జరిగిన ఎటాక్ డ్రామాని అతను కనిపెట్టగలడా?
Updated : Dec 2, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -944 లో.. జగతిని షూట్ చేసిన రౌడీతో శైలేంద్ర ఫోన్ మాట్లాడిన రికార్డింగ్ విని ఇంట్లో అందరూ షాక్ అవుతారు. నా కొడుకేం తప్పు చెయ్యలేదు రిషి. నువ్వేం మాట్లాడడం లేదేంటి అని రిషితో దేవయాని అనగానే.. నన్ను కాసేపు వదిలెయ్యండి అంటూ రిషి పక్కకి వెళ్తాడు. ఆ తర్వాత రిషి వెనకాలే వసుధార వెళ్తుంది. ఇక నువ్వు తప్పంచుకోలేవు శైలేంద్ర అని మహేంద్ర మనసులో అనుకుంటాడు.
ఆ తర్వాత శైలేంద్రకి ఫోన్ చెయ్యండి అని ముకుల్ ఫణింద్రకీ చెప్పగానే.. శైలేంద్రకి ఫోన్ ట్రై చేస్తునే ఉంటాడు ఫణీంద్ర. మరొకవైపు దేవయాని పక్కకి వెళ్లి శైలేంద్ర ఫోన్ కి చేస్తుంటే.. అప్పటికే విషయం అర్థం అయిన శైలేంద్ర దేవయాని ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే.. ట్రాప్ చేస్తారని లిఫ్ట్ చేయడు. అలా ఫణీంద్ర, దేవయాని, మహేంద్ర, ముకుల్.. ఇలా ఎవరు చేసిన శైలేంద్ర ఫోన్ లిఫ్ట్ చెయ్యడు. శైలేంద్ర టెన్షన్ పడుతుంటే ధరణి వచ్చి.. ఎందుకు టెన్షన్ పడుతున్నారని అడుగుతుంది. ఏం లేదంటూ శైలేంద్ర కవర్ చేస్తాడు. మరొకవైపు ఆ వాయిస్ అన్నయ్యదే.. అన్నయ్య ఇలా చేసి ఉంటాడా చెప్పు వసుధార అని రిషి అడుగుతు ఉంటాడు. ఇక శైలేంద్ర గురించి నిజం చెప్పాలని వసుధార అనుకొని చెప్పబోతుంటే అప్పుడే రిషిని ముకుల్ పిలువగా.. ఇద్దరు హాల్లోకి వెళ్తారు.
ఆ తర్వాత ఎవరి ఫోన్ కాల్స్ ని శైలేంద్ర లిఫ్ట్ చెయ్యడం లేదని ముకుల్ అంటాడు. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి అంటూ దేవయాని ఫోన్ ముకుల్ తీసుకొని చూడగా ఇప్పటివరకు శైలేంద్రకి ఫోన్ చేసినట్లు ఉందని ముకుల్ అడుగుతాడు. నా ఫోన్ కూడా లిఫ్ట్ చెయ్యడం లేదని చెప్పగానే.. అందరి ఫోన్లు అక్కడ పెట్టండి అని ముకుల్ చెప్తాడు. ఆ తర్వాత దేవయాని ఫోన్ కి శైలేంద్ర ఫోన్ నుండి వేరే అతడితో కాల్ చేపిస్తాడు శైలేంద్ర. " ఈ ఫోన్ వాళ్ళు హాస్పిటల్ లో ఉన్నారు. మీరు త్వరగా రండి" అని అతను చెప్పగానే.. అందరూ హాస్పిటల్ కీ వెళ్తారు. హాస్పిటల్ కి వెళ్ళగానే.. మాపై ఎవరో ఎటాక్ చేశారని ధరణి చెప్తుంది. రిషి ఎక్కడ అని వసుధారని మహేంద్ర అడుగుతాడు. నాతో వచ్చారంటూ బయటకు వెళ్లి చూస్తుండగా.. నాకు చిన్న వర్క్ ఉంది ఫినిష్ చేసుకొని వస్తానంటూ వసుధారకి రిషి మెసేజ్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.