Read more!

English | Telugu

ఎండీ పదవికి శైలేంద్ర అనర్హుడు.. తాగి పడిపోయిన మహేంద్ర!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -889 లో.....ఎండీగా బాధ్యతలు తీసుకోమని మహేంద్రకు ఫణింద్ర చెప్తాడు. నావల్ల కాదు నేను తీసుకోలేనని మహేంద్ర చెప్పి మీటింగ్ మధ్యలో నుండి వెళ్లిపోతాడు. ఇప్పుడు ఖచ్చితంగా కాలేజీకి ఎండీ అవసరం కదా? ఎవరిని ఎండీ గా కూర్చోపెట్టాలో ఇప్పుడు డిస్కషన్ చేయాలని ఫణింద్ర అంటాడు.

ఆ తర్వాత ఎవరో ఎందుకు డాడ్? మీరు ఉన్నారు కదా అని శైలేంద్ర అంటాడు. లేదు, ఎండీగా బాధ్యతలు తీసుకోవాలంటే చాలా అవగాహన ఉండాలి. నాకంత ఆసక్తి లేదు. అందుకే ఎండీగా ఎవరున్నా నేను సపోర్ట్  ఇస్తూనే ఉంటానని ఫణీంద్ర అంటాడు. ఎవరో ఎందుకు శైలేంద్ర ఉన్నాడు కదా అని దేవయాని అనగానే... వసుధార తెలివిగా అలోచించి.. బోర్డు మెంబెర్స్ కి శైలేంద్రకి ఇది వరకు చేసిన అనుభవం లేదు. పైగా మొన్న చెక్కు విషయం లో చూడకుండా సంతకం చేసి కాలేజీ ని రిస్క్ లో పెట్టాడని వసుధార అనగానే..

అవును శైలేంద్ర ఉండడం ఇష్టం లేదని బోర్డు మెంబెర్స్ అంటారు. ఫణింద్ర కూడా ఎండీ అయ్యే కెపాబిలిటి లేదని శైలేంద్రని అంటాడు. ఆ తర్వాత ఫణింద్ర వసుధార,  SI లు మాట్లాడుకుంటారు. రిషిపై నింద వెయ్యడానికి గల కారణాలు SI తో వసుధార చెప్తుంది. కానీ దానికి కారణం అయిన వాళ్ళ గురించి చెప్పదు. మరొక వైపు ఫణింద్ర, వసుధార ఇంటికి వెళ్తారు. రిషి పొద్దున్న నుండి భోజనం చెయ్యలేదని వసుధారకి ధరణి చెప్తుంది. ఇదంతా మా అయన వల్లే అని నాపై కోపంగా ఉందా వసుధారా అని ధరణి అడుగుతుంది. కానీ ఇంత కుట్రలు చేస్తున్న వాళ్ళకి శిక్ష పడాలని ధరణి చెప్పగా.. తొందరలోనే శిక్ష పడుతుందని వసుధార అంటుంది. 

ఆ తర్వాత జగతి అత్తయ్య గురించి ఆలోచిస్తూ రిషి భోజనం చెయ్యలేదని ధరణి అనగానే.. నేను వెళ్లి తీసుకోనీ వస్తానని వసుధార వెళ్తుంది. వెళ్లేసరికి జగతిని గుర్తుచేసుకుంటు రిషి బాధపడతాడు. ఆ తర్వాత వసుధార నచ్చజెప్పి రిషిని భోజనం చెయ్యడానికి ఒప్పిస్తుంది. డాడ్ కూడా భోజనం చెయ్యలేదని రిషి అంటాడు. సర్ ఇంటికి రాలేదా? మీటింగ్ మధ్యలోనే వచ్చేసారని వసుధార చెప్పగానే.. డాడ్ ఇంకా ఇంటికి రాలేదు. నాకు టెన్షన్ గా ఉందంటూ మహేంద్ర గురించి వెతుకుతాడు రిషి. మహేంద్రకి ఫోన్ చేస్తే ఎవరో ఒకతను లిఫ్ట్ చేసి.. ఈ ఫోన్ అతను ఇక్కడ తాగి పడిపోయి ఉన్నాడని చెప్పగానే.. రిషి వసుధార ఇద్దరు బయల్దేరతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.