English | Telugu

ఏంజిల్ మనసులో ఎవరున్నారో విశ్వనాథ్ తెలుసుకోగలడా!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -860 లో.. ఫణీంద్ర దగ్గర మంచి మార్కులు కొట్టేయలన్న ప్లాన్ తో డబ్బులు తీసుకొని వస్తాడు శైలేంద్ర. ఇక అలా వచ్చిన శైలేంద్ర.. ఫణింద్ర ముందు తనేదో కాలేజీ పరువు నిలబెట్టినట్లు ఫీల్ అయిపోయి డబ్బులు అరెంజ్ చేశానని ఫణింద్రకి చెప్పగానే ఫణింద్ర మెచ్చుకుంటాడు.

ఆ తర్వాత ఫణీంద్ర ముందు జగతి, మహేంద్ర లను బ్యాడ్ చెయ్యాలని శైలేంద్ర ప్లాన్ వేస్తాడు. డాడ్ ఇలా తెలియకుండా కాలేజీ విషయలు గాని ఇంటి విషయాలు గాని దాచిపెట్టారా? అలా చేస్తే డాడ్ కి ఇప్పుడే చెప్పండని శైలేంద్ర అంటాడు. అదేం లేదని మహేంద్ర అంటాడు. మరొకవైపు వసుధారకి ఏంజిల్ ఫోన్ చేసి.. రిషి మనసులో ఎవరో ఉన్నారని, అందుకే నాతో పెళ్లికి ఒప్పుకోవట్లేదని అంటుంది. అలా అనగానే నీకెలా తెలుసని వసుధార అడుగుతుంది. ఆ తర్వాత ఏంజిల్ వసుధారకి రిషి డ్రా చేసిన కళ్ళ ఫోటోని పంపిస్తుంది. కళ్లు ఎవరివో తెలుసుకోమని వసుధారకి ఏంజిల్ చెప్తుంది. ఇబ్బందిగానే వసుధార సరే అంటుంది. ఆ తర్వాత రిషికి ఆ కళ్ల ఫోటోని వసుధార పంపించగానే రిషి షాక్ అవుతాడు. ఈ ఫోటో ఏంజిల్ పంపించింది. ఆ కళ్లు ఎవరివో కనుక్కోమని అందని రిషికి చెప్తుంది వసుధార. ఆ తర్వాత వసుధారని రిషి కలిసి.. ఎందుకిలా చేస్తున్నావ్ అని అడుగుతాడు. నేనేం చెయ్యలేదు, ఏంజిల్ నాకు పంపింది, నేను మీకు పంపానని వసుధార చెప్తుంది. రిషి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మీరు మీ అంతటా మీరే నిజం తెలుసుకోవాలి. మేం చెప్పిన మీరు వినరని వసుధార అనుకుంటుంది.

మరొకవైపు వసుధారకి ఏంజిల్ ఫోన్ చేసి.. ఆ కళ్ళు ఎవరివో రిషిని అడిగావా? చెప్పడా అని అడుగుతుంది. లేదని వసుధార అంటుంది. ఏంజిల్ , వసుధారలు ఫోన్ లో మాట్లాడుకునేదంతా విశ్వనాథ్ వింటాడు. అంటే ఏంజిల్ మనసులో ఏం ఉందో వసుధారకి తెలుసన్నా మాట అని విశ్వనాథ్ అనుకుంటాడు. కాసేపటికి ఏంజిల్ దగ్గరికి విశ్వనాథ్ వచ్చి ఏమైందని అడిగితే.. ఏం లేదని ఏంజిల్ సమాధానం చెప్తుంది. మరొకవైపు జగతి, మహేంద్ర ఇద్దరు కలిసి శైలేంద్ర చేసే పనుల గురించి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.