English | Telugu

ఎంతకు తెగించాడు.. ఆమె చేతులు కట్టేసి బలవంతంగా...

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు' (Guppedantha Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1078 లో..... శైలేంద్రకి కూడా తెలియకుండా రాజీవ్ ప్లాన్ చేసి వసుధారని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. వసుధారని తాడుతో చేతులు కట్టేస్తాడు.. పెళ్లి కొడుకు లాగా రెడీ అయి రాజీవ్... వసుధార, శైలేంద్రల ముందుకు వస్తాడు. ఏం చేస్తున్నావ్ రాజీవ్ అని శైలేంద్ర అడుగుతాడు. నా మరదలని నేను పెళ్లి చేసుకుంటున్నానని రాజీవ్ అంటాడు. ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలని శైలేంద్ర గన్ పట్టుకొని ఆలోచిస్తుంటాడు.

ఆ తర్వాత ఏదైనా ప్లాన్ చేస్తున్నావా ఏంటి అందులో బుల్లెట్స్ లేవంటూ శైలేంద్రతో రాజీవ్ అంటాడు. నీ మెడలో ఈ తాళి కట్టాలంటే నీ మెడలో ఉన్న తాళి తీసేయ్యాలని రాజీవ్ అంటాడు. వద్దని వసుధార అన్నా రాజీవ్ వినకుండా వసుధార మెడలోని తాళిని గన్ తో తీస్తుంటాడు. అప్పుడే మహేంద్ర అక్కడికి వచ్చి కర్రతో రాజీవ్ తలపై కొడతాడు. ఆ తర్వాత సూపర్ బాబాయ్ కరెక్ట్ టైమ్ కి వచ్చావ్.. అయిన ఫాలో అవొద్దన్నాను కదా ఎలా తెల్సిందని శైలేంద్ర అనగానే.. దీనివల్ల అంటు వసుధార బ్లూటూత్ చూపిస్తుంది. నా మరదలిని పెళ్లి చేసుకుంటానన్న ప్రతిసారీ ఎవరో ఒకరు ఆపుతున్నారని మహేంద్రకి గన్ పెడుతాడు రాజీవ్.. అందులో బుల్లెట్స్ లేవని శైలేంద్ర అంటాడు. అప్పుడు లేవు కానీ ఇప్పుడున్నాయని రాజీవ్ అంటాడు. బుల్లెట్స్ చూస్తావా అంటు శైలేంద్రకి రాజీవ్ దగ్గరగా వచ్చి.. గన్ ని పక్కకు పేలుస్తాడు. అది చూసి శైలేంద్ర భయపడతాడు. మళ్ళీ తిరిగి మహేంద్రని గన్ తో బెదిరిస్తుంటే ఆ గన్ ని మహేంద్ర లాక్కొని రాజీవ్ ని బెదిరిస్తాడు.అప్పుడే కాని స్టేబుల్స్ ఎంట్రీ ఇస్తారు.. రాజీవ్ ని తీసుకొని వెళ్తుంటే.. జైలు నుండి వచ్చాక నిన్ను పెళ్లి చేసుకుంటానని వసుధారతో రాజీవ్ చెప్తాడు.

ఆ తర్వాత శైలేంద్ర ఇంటికి వెళ్లి హ్యాపీగా రాజీవ్ ని పోలీస్ తీసుకొని వెళ్లారని చెప్తాడు. అప్పుడే ధరణి వస్తుంది. రేపు కాలేజీలో నాకు మంచి జరుగుతుంది.. మీరు కాలేజీకి తప్పకుండా రండి అని శైలేంద్ర అంటాడు.. నేను రాలేను ఆ మంచి ఏంటో జరిగాక ఇంటికి వచ్చాక చెప్పండి అని ధరణి చెప్పి వెళ్తుంది. కొంపదీసి ఆ రాజీవ్ ని నువ్వు పట్టించలేదు కదా అని దేవయాని అడుగగా.. లేదని శైలేంద్ర అంటాడు. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది..ఎవడు పట్టించాడో గాని వాడిని మాత్రం ఆ రాజీవ్ బ్రతకనివ్వడని దేవయాని అంటుంది. నేను పట్టించానని రాజీవ్ అనుకోవట్లేదు కదా అని శైలేంద్ర అనుకుంటాడు. మరొకవైపు వసుధార, మహేంద్ర, మనులు ఇంటికి వెళ్తారు. మను ని చూసి అనుపమ ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.