English | Telugu

Guppedantha Manasu:  తండ్రికి గన్ గురి పెట్టిన కొడుకు.. మా బ్రతుకులని ఎందుకు నాశనం చేశావ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' గుప్పెడంత మనసు '. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-1058 లో.. దత్తత కార్యక్రమానికి తను రాలేనని వసుధారతో ఏంజిల్ ఫోన్ లో చెప్తుంది. మను కన్నతండ్రి బ్రతికే ఉండగా.. మహేంద్ర సర్ దత్తత తీసుకోవడం విశ్వంకి ఇష్టం లేదు. దాన్ని విశ్వం భరించలేకపోతున్నాడు. విశ్వం దత్తత కార్యక్రమానికి రాలేనని అంటున్నాడు.. నేను కూడా రాలేనని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఏంజిల్. మరోవైపు రిషిని గుర్తు చేసుకుంటుంది వసుధార. ఫోన్‌లో ఉన్న ఫొటోని చూస్తూ.. రిషి సర్.. మను మీ బ్రదర్ అంట.. అతన్ని దత్తత కార్యక్రమానికి ఒప్పించే బాధ్యతను మామయ్య నాకు ఇచ్చారు. మను గారిని ఎలా ఒప్పించాలి.. నాకు ధైర్యం సరిపోవడం లేదే.. ఇప్పుడేం చేయాలి. ఇంత పెద్ద నిజం మనుకి చెప్పకుండా ఉండలేను. నాకేమో ధైర్యం చాలడం లేదు.. మీరే ఈ నిజాన్ని మనుకి చెప్పే ధైర్యాన్ని ఇవ్వండి అంటూ వసుధార అంటుంది.

మరోవైపు శైలేంద్రని మహేంద్ర కలుస్తాడు. అమ్మ అన్నం తినట్లేదు.. నాన్న ఫీల్ అవుతున్నానాడు.. ఈ దత్తత కార్యక్రమం ఆపేయండి బాబాయ్ అంటు మహేంద్రతో శైలేంద్రకి చెప్పగా.. అది జరగని పని అని మహేంద్ర చెప్తాడు. నా మాట వినకపోతే నేను చేయాల్సింది నేను చేస్తాను.. నన్ను రెచ్చగొడుతున్నావ్ బాబాయ్ అని శైలేంద్ర అంటే.. రెచ్చగొడితే ఏం చేస్తావ్? నీకు చేతనైంది చేసుకోమని మహేంద్ర అంటాడు. సరే ఈ దత్తత కార్యక్రమం ఎలా జరుగుతుందో నేనూ చూస్తానని శైలేంద్ర అంటాడు. నువ్వు చూడాలనే కదా.. పిలిచింది.. వెళ్లి ట్రై చేసుకో.. నువ్వే కాదు.. మా అన్నయ్య, వదిన, ధరణి అంతా చూడాలి.. ఈ దత్తత కార్యక్రమాన్ని ఆపడానికి ట్రై చేశావో.. నేను మనిషినే కాదని శైలేంద్రతో మహేంద్ర చెప్పేసి వెళ్లిపోతాడు. మరోవైపు మనుని కలిసిన వసుధార.. మీ నాన్న పేరు మహేంద్ర అంటుంది. ‌అప్పుడే మహేంద్ర వచ్చి.. అమ్మా వసుధార.. ఏంటమ్మా, ఏం చెప్తున్నావ్.. నేను మను తండ్రిని ఏంటి?? మను నా కన్న కొడుకు ఏంటి? నువ్వు చెప్పేది నిజమా? ఈ విషయం నీకు ఎలా తెలుసు? అనుపమ చెప్పిందా? అని అడుగుతాడు. లేదు సర్.. అనుపమ మేడమ్ వాళ్ల పెద్దమ్మ చెప్పిందని వసుధార అంటుంది. దాంతో మహేంద్ర.. మను వైపు చూస్తూ.. నాన్నా మనూ.. నువ్వు నా కొడుకువి నాన్నా.. ఇన్నాళ్లూ నేను ఎందుకు ఎమోషనల్‌గా ఎందుకు కనెక్ట్ అయ్యానో అర్థం కాలేదు.. ఇప్పుడు అర్ధమైందని మహేంద్ర అంటాడు.

నాన్నా మనూ అంటు ప్రేమగా మహేంద్ర పిలుస్తుంటే.. ఆపండీ.. ఇక ఆపండీ.. ఇంకొక్కసారి నన్ను ప్రేమగా పిలవొద్దు.. ఇన్నాళ్లూ తండ్రి ఎవరో తెలుసుకోవాలనుకున్నది తండ్రి ప్రేమను పొందడానికి కాదు.. మా బ్రతుకుల్ని ఎందుకు నాశనం చేశావోనని నిలదీయాడానికి? లోకంలో గొప్పగొప్పతండ్రులే కాదు.. నీలాంటి నీఛమైన తండ్రులు కూడా ఉంటారని చెప్పడానికి? నన్ను ఇంకోసారి ముట్టుకుంటే ఇక్కడే షూట్ చేసి పారేస్తా అని మను గన్ బయటకు తీస్తాడు. దాంతో మహేంద్ర.. నువ్వు నన్ను చంపేసినా పర్లేదు.. కన్నకొడుకుని తాకొద్దూ.. మాట్లాడొద్దూ అంటే నేను తట్టుకోలేను నాన్నా.. నా కొడుకుని నేను దగ్గరకు తీసుకోకుండా నేను ఉండలేను.. నువ్వు నన్ను చంపేసినా పర్లేదు.. చంపెయ్ చంపెయ్ అని మను మీదికి మహేంద్ర వెళ్తాడు. మను కాల్చిపారేస్తాడు. వెంటనే అనుపమ కలలో నుంచి.. మహేంద్రా అంటూ బయటకు వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.