English | Telugu

Guppedantha Manasu : నాన్నెవరో తెలుసుకోవాలని మను.. ఆ ఒక్క ప్రశ్న ఏంటంటే!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1035 లో.. మనుని మహేంద్ర కలిసి.. అసలు నీకు అనుపమకి మధ్య సమస్య ఏంటి ఎందుకు దూరంగా ఉంటున్నారని అడుగుతాడు. తన తల్లికి దూరంగా ఎందుకు ఉంటున్నాడనే విషయం చెప్పడానికి మను ఇష్టపడడు. నీ తల్లిని బాధ పెట్టి నువ్వు బాధపడడం ఎందుకు? సమస్యని సాల్వ్ చేసుకొని అందరు హ్యాపీగా ఉండొచ్చు కదా అని మహేంద్ర అంటాడు. ఉండాలని నాకు ఉంది కానీ అది జరగదని మను అంటాడు.

నీ తల్లి నిన్ను అమ్మ అని పిలవకని మాట తీసుకుందంటే దానికి బలమైన కారణం ఉండే ఉంటుంది. ఏంటని మహేంద్ర అడుగుతాడు. ఒకే ఒక ప్రశ్న వల్ల మా మధ్య ఈ సమస్య అని మను అంటాడు. ఏంటి ఆ ప్రశ్న అని మహేంద్ర అడుగగ.. నేను చెప్పలేను సర్ నన్ను ఇబ్బంది పెట్టకండి అంటూ మను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరొకవైపు అనుపమ హాల్లో కూర్చొని ఉన్న వసుధార దగ్గరికి వస్తుంది. మీరు మను రాలేదా అని అడుగుతారు అనుకున్నానని వసుధార అనగానే.. అయిన ఎందుకు వస్తాడని అనుపమ అంటుంది. అసలు మీ మధ్య గొడవలేంటని ఏంజిల్ అడుగుతుంది. అనుపమ కూడా వాళ్లకి సమాధానం చెప్పడానికి ఇష్టపడదు.

మరొకవైపు మను ఒక దగ్గర ఆగి.. అనుపమ ఫోటో చూస్తూ ఎందుకు అమ్మ నన్ను ఇంత బాధపెడుతున్నావ్. మహేంద్ర సర్ అడుగుతున్నారు.. ఏమని చెప్పాలి... నాకు ఎందుకు ఈ శిక్ష వేసావ్ ? నాన్న కొడుకుకి వేలు పట్టి నడిపిస్తాడు. ఇన్ని సంవత్సరాల నుండి నా తండ్రి గురించి తెలియదు. నాకు నాన్నతో ఉండాలని ఉంటుంది కదా.. అసలు నా ప్రశ్నకి సమాధానం చెప్తావా ? లేక ఎప్పటికి ఇలాగే ఉండాలా అంటూ మను అనుపమ ఫోటో చూస్తూ ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత అనుపమ దగ్గరికి మహేంద్ర వచ్చి.. మళ్లీ మీ మధ్య గొడవ ఏంటి ఒకే ప్రశ్న కదా.. ఆ ప్రశ్న ఏంటని అడుగుతాడు. అనుపమ సైలెంట్ గా ఉంటుంది. మను నాన్న ఎవరు అనేదే కదా నేనే అడుగుతున్న మను అడగడంలో తప్పు లేదు.. ఎవరు మను తండ్రి అని మహేంద్ర అడుగుతాడు. నేను చెప్పలేనని అనుపమ అంటుంది. అప్పుడే వసుధార వచ్చి.. మావయ్య మేడమ్ ని ఇబ్బంది పెట్టకండి. దేవయాని మేడమ్ వచ్చి కూడా మేడమ్ ని ఇబ్బంది పెట్టారని చెప్తుంది. అలా అయితే నిజం ఎలా తెలుస్తుందని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.