English | Telugu
Guppedantha Manasu:ఎండీ భాద్యతల నుండి తప్పుకున్న వసుధార.. శైలైంద్ర ప్లాన్ సక్సెస్!
Updated : Dec 22, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -952 లో.. వసుధార బ్రాస్ లైట్ పట్టుకొని లెటర్ లో చెప్పిన అడ్రెస్ కి వచ్చి రిషి కోసం చూస్తుంటుంది. అయిన రిషి ఎక్కడ కన్పించడు. అప్పుడే శైలేంద్ర వచ్చి.. అ లెటర్ ని పంపించింది నేనే. మీరు అందరు అనుకుంటున్నారు కదా అసలు రిషి నా దగ్గర ఉన్నడో లేడో అనే డౌట్ ఉంది కదా ఇప్పుడు నమ్ముతున్నావా రిషి నా దగ్గరే ఉన్నాడని శైలేంద్ర అంటాడు.
ఆ తర్వాత ఇంత మృగంలాగా ఎలా మాట్లాడుతున్నావని వసుధార ఎమోషనల్ అవుతుంది. అవును నేను యానిమల్ నే అంటు శైలేంద్ర రాక్షసంగ అరుస్తుంటాడు. నువ్వు ఇకనైనా త్వరగా నిర్ణయం తీసుకో లేకపోతే ఇప్పుడు బ్రాస్ లైట్ వచ్చింది. ఇంకొక సారి అది పెట్టుకున్న హ్యాండ్ వస్తుందని శైలేంద్ర అనగానే.. వసుధార కోపంగా శైలేంద్ర కాలర్ పట్టుకుంటుంది. నువ్వు ఏమి చెయ్యలేవు. త్వరగా నువ్వు నిర్ణయం తీసుకో ఎండీ చైర్ నాకు వదిలేసి రిషిని కాపాడుకోమని శైలేంద్ర చెప్తాడు. నువ్వు ఈ విషయం గురించి ఎవరితోను చెప్పకూడదు అని కండిషన్ పెడతాడు శైలేంద్ర. వసుధార నిస్సహయoగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరొకవైపు ఎండీ అయి ఉండి మీటింగ్ కి లేట్ గా వస్తుందా? ఇప్పటికే టైమ్ అయిపొయిందంటు బోర్డు మెంబెర్స్ అందరు తమకి తోచింది మాట్లాడుతుంటారు. వాళ్ళని రెచ్చగొట్టేలా దేవయాని మాట్లాడుతు ఉంటుంది. అ తర్వాత బోర్డు మెంబర్స్ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతారు. అసలు వసుధార ఎందుకు రాలేదు కనుక్కుంటానని మహేంద్ర వెళ్ళిపోతాడు. మరొకవైపు నీ వల్లే ఇదంతా జరిగింది. నువ్వు మీటింగ్ కి వచ్చావ్ ఇలా అయిందంటు దేవయాని మీదకి ఫణీంద్ర విరుచుకుపడుతాడు. కాసేపటికి ఇంటి దగ్గరకి వచ్చి వసుధార బాధపడుతుంది. మహేంద్ర వచ్చి మీటింగ్ కి ఎందుకు రాలేదని వసుధారని అడుగుతాడు. రిషి కోసం వెళ్ళానని మాత్రమే చెప్తుంది కానీ శైలేంద్ర గురించి ఏమి చెప్పదు. రేపు మీటింగ్ అరెంజ్ చెయ్యండి అందులో ఒక నిర్ణయం తీసుకోబోతున్నానని మహేంద్రకి వసుధార చెప్తుంది.
అ తర్వాత అదే విషయం శైలేంద్రకి వసుధార ఫోన్ చేసి మీటింగ్ కి రమ్మని చెప్పగానే.. శైలేంద్ర హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. దేవయాని వచ్చి ఏంటి అంత హ్యాపీగా ఉన్నావని శైలేంద్రని అడుగుతుంది. రేపు మీటింగ్ కి వెళ్తే నీకే తెలుస్తుందని శైలేంద్ర అంటాడు. మరుసటి రోజు ఉదయం మీటింగ్ జరుగుతుంది. రిషి కన్పించడం లేదు.. నేను ఎండీగా బాధ్యతలు సక్రమంగా చెయ్యడం లేదు.. అందుకే నేను ఎండీగా తప్పుకుంటున్నానని వసుధార అనగానే మహేంద్ర షాక్ అవుతూ.. ఏంటి ఏమైందని అడుగుతాడు. ఏమి లేదని వసుధార అనగానే.. మహేంద్ర కోపంగా శైలేంద్ర వంక చూస్తాడు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.