English | Telugu
ఏదైనా చేయాలి అనుకుంటే అంగవైకల్యం అడ్డు కాదు!
Updated : May 2, 2023
ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో కస్తూరి నటన చూసినవారు ఎవరైనా సరే ఇట్టే కనెక్ట్ ఐపోతారు. ఎందుకంటే చాలా నాచురల్ గా ఉంటుంది ఆమె యాక్షన్. అలాంటి కస్తూరి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ఎవరితోనూ ఒక మాట పడదు..సినిమాలు, సీరియల్స్‌లో చాలా హోమ్లీ లుక్ లో కనిపిస్తుంది కస్తూరి.. బయట మాత్రం చాలా మోడరన్‌గా ఉంటుంది. మోడరన్ లుక్ లో ఉండే ఫొటోస్ ని, వీడియోస్ ని కూడా సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ ఉంటుంది. కస్తూరికి జాలి గుండె కూడా ఎక్కువే...తనకు వచ్చే దాంట్లో కొంత కాన్సర్ పేషెంట్స్ కోసం ఖర్చు చేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక వీడియో పోస్ట్ చేసింది. "ఈరోజు చాలా ప్రత్యేకమైన అభిమానిని కలిశాను. నా దగ్గరకు ప్రసాద్ లక్ష్మణ్ అనే ఒక మూగ , చెవుడు ఉన్న ఒకతను వచ్చాడు.
ఆత్మవిశ్వాసంతో నిండి ఉన్న ఒక ఫ్యాన్ ని కలవడం చాలా హ్యాపీగా ఉంది. అతను ఎంతోమందికి ఇన్స్పిరేషన్..మనం ఏదైనా చేయాలి అనుకుంటే దానికి అంగవైకల్యం అడ్డు కాదు. ప్రేమకు అంగవైకల్యం అనేది లేదు " అంటూ కామెంట్ పెట్టింది. కార్ డ్రైవర్ గా చేస్తున్నట్లు అతను మెసేజ్ టైపు చేసి చూపించాడు. దాంతో కస్తూరి అతనికి "ఆల్ ది బెస్ట్" అని చెప్పింది. అతను కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. ఇక ఈ వీడియో చూసాక నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. "మీరే అతనికి ఇన్స్పిరేషన్ అయ్యి ఉండొచ్చు..."అని అంటున్నారు. కస్తూరి చెప్పుకోదగ్గ బోల్డ్ బ్యూటీ. సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఏదైనా నచ్చని విషయాలు ఉంటే మొహమాటం లేకుండా దుమ్ము దులిపేస్తుంది. ఆమె ఇలా దుమ్ము దులిపే వీడియోస్ ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.