English | Telugu
ఎందుకయ్యా ఇలాంటి సినిమాలు తీసి జనాల్ని ఏడిపిస్తున్నారు!
Updated : Aug 29, 2023
బేబీ సినిమా ఎంత హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఏ అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. అయితే సెలబ్రిటీలు సైతం ఈ సినిమాని అభినందిస్తున్నట్టు చాలా మంది చెప్పారు తాజాగా గీతు రాయల్ ఈ సినిమా గురించి కామెంట్ చేసింది. బేబి సినిమా గురించి ఇప్పటికే మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఇలాంటి సినిమాలు తీసి మనుషులను ఏడ్పించడం ఎందుకంటూ తిట్టేసింది గీతు రాయల్.
గీతు రాయల్ తన ఇన్ స్టాగ్రామ్ లో 'బేబీ' సినిమా తీసిన డైరెక్టర్ ని ,హీరో హీరోయిన్ ని ట్యాగ్ చేస్తూ తిట్టింది. ఎందుకయ్యా జనాల్ని ఇలా ఏడిపిస్తున్నారని తిట్టింది. అసలు విషయానికొస్తే గీతు రాయల్ భర్త వికాస్ బేబి సినిమా చూస్తూ ఎమోషనల్ అవుతూ ఏడ్చాడు. ఇతను తమిళ నేపథ్య కుటుంబానికి చెందినవాడు. ఇంజనీర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసిన వికాస్.. గీతు రాయల్ ని పెళ్ళి చేసుకున్నాడు. గీతు రాయల్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో.. తన ఆటతీరు బాగుందంటూ చాలా సంతోషంగా ఉందంటూ చెప్పిన విషయం తెలిసిందే. వికాస్ ఎమోషనల్ అంటూ తన భార్య గీతు రాయల్ చాలా సందర్భాలలో చెప్పిన విషయం తెలిసిందే.
గీతు రాయల్.. ఇప్పుడు అందరికి సుపరిచితమే.. బిగ్ బాస్ సీజన్-6 అని అనగానే అందరికి గీతు రాయలే గుర్తుకొస్తుంది. గీతు రాయల్ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత తనని చిత్తూరు చిరుత అని నాగార్జున ముద్దుగా పిలిచేవాడు. గీతు తన మార్క్ స్ట్రాటజీస్ తో గేమ్ ప్లాన్ తో తోటి కంటెస్టెంట్స్ ని ఆడుకునేది. మైండ్ గేమ్ తో టాస్క్ లు ఫినిష్ చేస్తూ అందరిచేత గుడ్ కంటెస్టెంట్ అని అనిపించుకుంది. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నన్ని రోజులు తన స్వార్థం తను చూసుకున్న గీతు రాయల్.. ఆదిరెడ్డి ఒక్కడితో మాత్రం క్లోజ్ గా ఉండేది. ఆది ఆది అంటూ ఎప్పుడు తనతోనే తిరిగేది. వాళ్ళిద్దరు యూట్యూబ్ లో రివ్యూలు ఇస్తుంటారు. అందుకేనేమో ఇద్దరు ఇట్టే కలిసిపోయారు. అయితే తన బిహేవియర్ అందరికీ నచ్చేది కాదు. దాంతో ఎలిమినేట్ అయింది. అయితే బిగ్ బాస్ హౌజ్ ని విడిచి వెళ్ళనని ఏడ్చిన గీతు రాయల్ ని ఓదార్చి బయటకు పంపించేసాడు నాగార్జున. అయితే గీతు ఎంత హౌజ్ లో తన స్వార్థం చూసుకున్నా ఎలిమినేట్ అయినప్పుడు చాలా మంది ఫ్యాన్స్ సపోర్ట్ గా నిలిచారు.