Read more!

English | Telugu

ఫైమా చెప్పిన 'ఫన్' ఎవరు? 'ఫ్రస్టేషన్' ఎవరు?

బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకొచ్చిన ఫైమా, స్టేజ్ మీదకి వచ్చింది. నాగార్జున కాసేపు మాట్లాడాక, తన ఏవీ చూసుకుంది. కాస్త ఎమోషనల్  అయ్యింది. ఆ తర్వాత ఫైమాని, హౌస్ మేట్స్ తో టీవీలో మాట్లాడించాడు నాగార్జున. "నా లైఫ్ లాంగ్ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా.. చాలా మెమోరీస్ ఇచ్చారు" అని చెప్పింది.

ఆ తర్వాత ఫైమాకి, నాగార్జున ఒక టాస్క్ ఇచ్చాడు. అదేంటంటే హౌస్ లో ఫన్ ఎవరు? ఫ్రస్టేషన్ ఎవరు? అని చెప్పమన్నాడు. ఇక ఫైమా మాట్లాడుతూ "ఆదిరెడ్డికి 'ఫన్'. ఎందుకంటే సూపర్ ఫన్‌ ఇస్తాడు. ఆది మాట్లాడేటప్పుడు తెలియకుండానే ఫన్ ఇస్తుంటాడు. తర్వాత కీర్తి 'ఫన్'. కీర్తి.. నీలో కూడా ఒక కమెడియన్ దాగి ఉన్నాడు. బయటకు తీయ్. శ్రీసత్య 'ఫన్'. సత్య, నేను కలిసి కూర్చున్నామంటే మాటలు ఎక్కడికో వెళతాయి సర్. ఫుల్ జోక్స్ వేస్తుంది సత్య" చెప్పింది. "ఆ తర్వాత శ్రీహాన్ ఫన్ సర్. ఎందుకంటే ఒక టాస్క్ లో గొడవ అవుతూ ఉంది. వాళ్ళతో మాట్లాడుతూ సడన్ గా నా వైపుకి తిరిగి, దా ఫైమా చూసుకుందాం అని అన్నాడు. ఒక్కసారిగా షాక్ అయ్యాను. తర్వాత మస్త్ నవ్వుకున్నాం" అంటూ శ్రీహాన్ గురించి చెప్పింది ఫైమా. అలాగే రోహిత్ కి ఫన్ ఇచ్చింది. 

ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ "ఫైమా.. మరి ఫ్రస్టేషన్ ఎవరూ లేరా?" అని అడుగగా, "రేవంత్ ఫ్రస్టేషన్" అని చెప్పింది. రేవంత్ 'ఫ్రస్టేషన్ కి బ్రాండ్ అంబాసిడర్' అని చెప్పింది. ఆ తర్వాత  "ఇనయా ఫన్" అని చెప్పగా "అంటే ఏంటి ఇనయా ఫ్రస్టేట్ అవ్వదా ఫైమా" అని నాగార్జున అడుగగా "ఒకప్పుడు ఫ్రస్టేషన్ ఉండేది సర్. కాని ఇప్పుడు కాదు సర్. మారిపోయింది" అని చెప్పింది. ఇలా హౌస్ లో ఒక్కొక్కరి గురించి ఫైమా చెప్పుకొచ్చింది.