English | Telugu
వామ్మో ఫారియాకి ఇష్టమైన ఊత బూతు పదం ఇదా...కష్టం బ్రో
Updated : May 9, 2025
చిట్టి అలియాస్ ఫారియా అబ్దుల్లా అంటే గుర్తొచ్చే మూవీ "జాతి రత్నాలు". ఈ మూవీ ఫుల్ కామెడీగా ఉంటుంది. ఆ ఫారియా ఇప్పుడు బుల్లితెర మీద కొన్ని షోస్ లో కనిపిస్తోంది. డాన్స్ ఐకాన్ సీజన్ 2 లో జడ్జ్ గా వచ్చింది. రీసెంట్ గా సుమతో చాట్ షోకి వచ్చింది. ఐతే ఇందులో సుమ ఒక ప్రశ్న అడిగింది. "డేటింగ్, లవ్, మ్యారేజ్ చేసుకోవడానికి ముగ్గురు సెలబ్రిటీస్ ని ఎవరో చెప్పు" అని అడిగింది. "యంగ్ పవన్ కళ్యాణ్ గారితో డేటింగ్ యంగ్ నాగార్జున గారితో లవ్, ప్రభాస్ తో మ్యారేజ్ " అని చెప్పింది ఫారియా. "మీరు ఎక్కువగా వాడే ఊత పదాలు ఏంటి" అని అడిగింది సుమ.
"నీ యమ్మ..." అనేసరికి ఊతపదాలే అడిగా కానీ అన్నీ బూతు పదాలే చెప్తోంది అని ఫీలయ్యింది సుమ. జాతిరత్నాలు సినిమా కోసం ఇంటికి వెళ్లి మరీ నేర్చుకున్నా అలాగే నవీన్ కూడా నాతోనూ...చాలా ఫన్ ఉండేది నవీన్ తో, అనుదీప్ తో అని చెప్పింది ఫారియా. అలాగే ఫారియా ఇంగ్లీష్ లో సుమ గురించి ఒక రాప్ సాంగ్ పాడి సుమానే ఎంటర్టైన్ చేసింది. ఫారియా సుమాని అడిగింది "మీ హజ్బెండ్ ని ప్రేమగా పిలిచే మూడు పదాలు చెప్పండి " అని అడిగింది. "ఏవండీ, రాజా, రాజ్" అని ఆన్సర్ ఇచ్చింది సుమ. ఇలా ఫారియా వెరైటీ ఆన్సర్స్ ఇచ్చి మంచి ఫన్ క్రియేట్ చేసింది. ఫారియా చాలా సెలెక్టెడ్ మూవీస్ చేస్తూ ఉంటుంది. "ది జెంగాబురు కర్స్, బచ్చలమల్లి, రావణాసుర, బంగార్రాజు, మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్" లాంటి ఎన్నో మూవీస్ లో నటించింది.
