English | Telugu

Brahmamudi : ఒక్కటైన యామిని, రుద్రాణి.. స్పృహకోల్పోయిన రాజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -717 లో..... రాజ్ కి గతం గుర్తుచేసే పనిలో భాగంగా అప్పు, కళ్యాణ్ ఇద్దరు రాజ్, కావ్య వాళ్ళ పెళ్లి ఎలా జరిగిందని తమ స్టోరీలాగా చెప్తుంటే రాజ్ ఆసక్తిగా వింటాడు. నాకు తెలిసిన స్టోరీలాగా అనిపిస్తుందని రాజ్ అనుకుంటాడు. ఎక్కడ రాజ్ కి గతం గుర్తుకి వస్తుందోనని యామిని టెన్షన్ పడుతుంది. మరొకవైపు రాజ్ కి గతం గుర్తుకి రాకూడదని రాహుల్, రుద్రాణి పవర్ కట్ చెయ్యడానికి పవర్ మెయిన్ దగ్గరికి వెళ్తారు. పవరాఫ్ చేయబోతుంటే.. అప్పుడే యామిని కూడా పవరాఫ్ చేయబోతుంది.

మీకు కావలిసిందే నాకు కావాలి రాజ్ కి గతం గుర్తు రాకూడదని రుద్రాణి, యామిని అనుకుంటారు శత్రువుకి శత్రువు మిత్రువు అని యామిని, రుద్రాణి ఒకటి అయ్యి పవరాఫ్ చేస్తారు. రాజ్ కి గతం గుర్తు రాబోతున్న టైమ్ లో పవర్ పోవడంతో అంత డిస్టబెన్స్ అవుతుంది. నేనే పవర్ ఆఫ్ చేసాను అనికావ్యకి చెప్తుంది యామిని. బావ వెళదాం పదా అని యామిని రాజ్ ని తీసుకొని వెళ్తుంటే..కళ్యాణ్ దగ్గరికి రాజ్ వెళ్లి మీ స్టోరి వినాలని ఉందని అంటాడు. అందరు మీ దగ్గర ఉన్న ఫోన్ లో టార్చు ఆన్ చెయ్యండి అని చెప్పగానే అందరు టార్చ్ ఆన్ చేస్తారు. కళ్యాణ్, అప్పు కలిసి రాజ్, కావ్య స్టోరీని కంటిన్యూ చేస్తారు.

ఆ తర్వాత రాజ్ అంత వింటునే తల పట్టుకుంటాడు. కళ్ళు తిరుగుతున్నట్లు బెహేవ్ చేస్తూ కావ్యని చూస్తూ నువ్వు అంటూ ఏదో చెప్పబోతు స్పృహకోల్పాతాడు. రాజ్ దగ్గరికి కి యామిని వస్తుంటే వద్దని కావ్య ఆపుతుంది. రాజ్ ని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. గతం గుర్తు చేసుకోవడానికి ట్రై చేశారని డాక్టర్ తో కావ్య చెప్పగానే.. అలా చెప్పగానే అలా చేస్తే తన ప్రాణానికి ప్రమాదం అని డాక్టర్ చెప్తాడు. ఇప్పుడు బానే ఉన్నాడు ఇంకొకసారి ఆలా చెయ్యకండి అని డాక్టర్ చెప్తాడు. అప్పుడే యామిని వస్తుంది. మీరు ఎవరు రాజ్ కి గుర్తు లేదు.. నేను తన మరదలిని అని మాత్రమే గుర్తు ఉందని కావ్య వాళ్ళకి కోపం వచ్చేలా యామిని మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.