English | Telugu
మిస్టర్ అండ్ మిసెస్.. ఒకరికి ఒకరు కొత్త రియాల్టీ షో ప్రారంభం!
Updated : Oct 8, 2022
బుల్లితెర మీద శని, ఆదివారాల్లో షోస్ ఎక్కువగా కనిపిస్తున్నాయ్ కానీ మాములు రోజుల్లో షోస్ హడావుడి కొంచెం తగ్గిందనే చెప్పొచ్చు. అందుకే దీన్ని భర్తీ చేయడానికి ఇప్పుడు ఈటీవీలో ప్రతీ మంగళవారం రాత్రి 9 .30 కి మిస్టర్ అండ్ మిస్సెస్ రియాలిటీ షో అక్టోబర్ 11 నుంచి స్టార్ట్ కాబోతోంది.
ఐతే ఇప్పుడు ఈ షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి హోస్ట్ గా శ్రీముఖి చేస్తోంది. తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం బ్యూటిఫుల్ స్మైలింగ్ స్నేహ ఈ షోకి వచ్చేసింది. ఇక శ్రీముఖి ఆమెను ఇన్వైట్ చేసి "మిస్టర్ ప్రసన్న గారు ఎక్కడ అనేసరికి నా గుండెల్లో ఉన్నారని స్నేహ చూపిస్తుంది. హలో ప్రసన్న గారు" అంటూ పలకరించింది శ్రీముఖి. తర్వాత శివబాలాజీ ఎంట్రీ అదిరిపోయింది. "కోపం అతనికి ముక్కు మీద ఉంటుంది , కానీ ముక్కుసూటితనం ఆయన మాటల్లో ఉంటుంది" అంటూ శివబాలాజీని ఇన్వైట్ చేస్తుంది శ్రీముఖి. "భర్తది అప్పర్ హ్యాండా, భార్యాదా" అని అడిగేసరికి "ఇద్దరి చేతులు సమానంగా లేకపోతే జీవితం వంకరగా ఉంటుందని" చేసి మరీ చూపించాడు శివ బాలాజీ. తర్వాత అనిల్ రావిపూడి ఈ షోలో ఎంట్రీ ఇచ్చారు.
"లవ్ లెటర్ రాసినప్పుడు ఎలాంటి పాయింట్స్ రాస్తే అవతలి వాళ్ళు కచ్చితంగా ఒప్పుకుంటారు ?" అనే ప్రశ్నతో ఇన్వైట్ చేస్తుంది శ్రీముఖి. "నీలాంటి అమ్మాయి ఐతే అబ్బాయి ఉన్న ఆస్తి రాసిస్తానంటే చాలు" అంటాడు అనిల్. మరి అబ్బాయిలకు అని శ్రీముఖి అడిగేసరికి "అబ్బాయిలు సున్నిత మనస్కులు కదా మనసొక్కటి ఇస్తే చాలు.. వెనక బోల్డ్ లగ్గేజ్ ఉంటుందిగా. స్ట్రెస్, టెన్షన్, ఇగో, అరవటాలు, తిట్టడాలు, ఓదార్పు యాత్రలు..ఇవన్నీ ఉంటాయిగా" అంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చి షోలో ఫన్ క్రియేట్ చేసాడు అనిల్ రావిపూడి.