Read more!

English | Telugu

Eto Vellipoyindhi Manasu : అర్థరాత్రి ప్రియుడితో కలిసి మాట్లాడుతున్న రామలక్ష్మి.. స్వయంగా భర్తే తప్పించాడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -82 లో...సీతాకాంత్ తన డైరీ కోసం వెతుకుతాడు. టేబుల్ పైన డైరీ చూసి రామలక్ష్మి ఎక్కడ చూసి అపార్థం చేసుకుంటుందోనని టెన్షన్ పడుతు వెళ్లి డైరీని తీసుకుంటాడు. మరొకవైపు అభి ఫ్రెండ్స్ తో డ్రింక్ చేస్తూ... ఆ సీతా సర్ మమ్మల్ని విడకొడతాడని డౌట్ ని రామలక్ష్మి లో క్రియేట్ చేశాను.

ఇప్పుడు సీతా సర్ ఏం మాట్లాడినా కూడా రామలక్ష్మికి డౌట్ వస్తుంది. నా ప్రవర్తన మీద డౌట్ ఉందని అంటాడా.. తన ప్రవర్తన మీదే డౌట్ వచ్చేలా నేను చేసానని అభి అంటాడు. ఏదైనా దూరుద్దేశం ఉందా అని రామలక్ష్మి ఆలోచిస్తుంది.. ఇక సీతాకాంత్ ఆ విషయంలో బిజీగా ఉండి నా గురించి ఆలోచించడం మానేస్తాడని అభి.. తన ఫ్రెండ్ తో అంటాడు. నువ్వు ఇప్పుడు తప్పు గా ఆలోచిస్తున్నావ్ .. నీపై డౌట్ వచ్చిందంటే అసలు సీతా సర్ వదిలిపెట్టడని తన ఫ్రెండ్ అనగానే.. అలా అనుమానం రాకుండా ఉండడానికి ఇంకొక నాటకానికి తెర తీసానని అభి అంటాడు. మరొకవైపు రామలక్ష్మి పడుకొని ఆలోచిస్తుంటుంది. అసలు సీతా సర్ మంచివాడు కాదా? అభి ఎందుకలా అంటున్నాడని రామలక్ష్మి అనుకుంటుంది. అప్పుడే సీతాకాంత్ వాళ్ళ ఇంటికి అభి వచ్చి.. రామలక్ష్మి కి ఫోన్ చేసి బయటకు రమ్మంటాడు.

రామలక్ష్మి ఇప్పుడు రాలేనని చెప్పినా కూడా అభి వినకుండా.. నువు నేను దూరం అయినట్లు కల వచ్చిందంటూ యాక్ట్ చేస్తుంటాడు. ఇక తప్పక రామలక్ష్మి.. అభి దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. నీ పేరు పచ్చబొట్టు వేయించుకున్నానని అభి చెప్తాడు. అప్పుడే శ్రీలత దూరం నుండి వాళ్ళని చూసి.. భళే దొరికారంటూ దొంగ దొంగ అని అరుస్తుంది‌. దాంతో అందరు బయటకు వస్తారు. చెట్ల వెనకాలున్నారు అనగానే .. అప్పుడే సీతాకాంత్, రామలక్ష్మి లు వస్తారు. మీరేంటి అక్కడ ఉన్నారని పెద్దాయన అడుగుతాడు. వెన్నెల బాగుందని ఇక్కడ మాట్లాడుకుంటున్నామని సీతాకాంత్ చెప్తాడు. వెనకాల నుండి అభి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత.. ఏంటి మమ్మీ అన్నయ్యని చూసి అభి అంటున్నావని అనగానే.. లేదు రా అభినే వచ్చింది. సీతాకాంత్ తప్పించాడని శ్రీలత అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.