English | Telugu

Eto Vellipoyindhi Manasu : కోడలి చేత సంతకం పెట్టించలేకపోయిన సవతి తల్లి.. బాధలో కొడుకు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -291 లో.....రామలక్ష్మి పెట్టిన ట్విస్ట్ కి శ్రీలత వాళ్లకు మైండ్ బ్లాక్ అవుతుంది. ఎలాగైనా రామలక్ష్మితో ఆస్తులు అమ్ముకోవచ్చని సంతకం పెట్టించాలని రామలక్ష్మి దగ్గరికి ధనని పంపిస్తారు. ధన లోపలికి వెళ్లకుండా బయట నుండే రామలక్ష్మిని పిలుస్తుంటాడు. కాసేపటికి రామలక్ష్మి రాగా.. ధన పక్కకి తీసుకొని వెళ్లి దీనిపైన సంతకం పెట్టమని అంటాడు.. నేను పెట్టనని తన చెంప చెల్లుమనిపిస్తుంది రామలక్ష్మి. అది మాణిక్యం చూస్తాడు. ఆ తర్వాత ధన జరిగింది వెళ్లి బయటున్న సందీప్, శ్రీలతలకి చెప్తాడు.

నువ్వు వెళ్ళు.. అమ్మలేదంటే మన పరిస్థితి తెలుసు కదా అని సందీప్ అంటాడు. ఆ తర్వాత ముగ్గురు మళ్ళీ రామలక్ష్మి దగ్గరికి వెళ్తారు. శ్రీలత మాట వినగానే మా అమ్మ వచ్చిందంటూ తినే ప్లేట్ లో వాటర్ పోసి వెళ్తాడు సీతాకాంత్.

ఇంత మోసం చేస్తారా ఆస్తులన్నీ రాసి అమ్ముకునే అవకాశం లేకుండా నీ భార్య వీలునామా రాసిందని శ్రీలత అనగానే.. నిజంగా నాకు తెలియదని సీతాకాంత్ అంటాడు. అసలేం జరుగుతుంది.. మీ అమ్మ నిజ స్వరూపం నీకు తెలియదు అల్లుడు అని మాణిక్యం అనగానే.. నా గురించి నేనే నీ అల్లుడుకి చెప్పానని అనగానే మాణిక్యం షాక్ అవుతాడు. ఆ తర్వాత ధన పైన సుజాత, మాణిక్యంలు తిడతారు. సంతకం పెట్టమని సీతాకాంత్ అనగా.. నేను పెట్టను మీరు వాళ్లు బాగుపడాలని నన్ను పెట్టమని అనకండి అని రామలక్ష్మి అంటుంది. దాంతో సీతాకాంత్ సైలెంట్ గా ఉంటాడు.

మరొకవైపు శ్రీలత కోపంగా ఇంటికి వెళ్తుంది. ఏమైందంటూ శ్రీవల్లి అడుగగా సంతకం పెట్టలేదని చెప్తారు. నాకు అర్థమైంది.

తను ఛాలెంజ్ చేసి వెళ్ళినప్పుడే ఏదో ప్లాన్ చేసిందని అర్థమైందని శ్రీవల్లి అంటుంది. శ్రీలత కోపంగా సీతాకాంత్ ఫోటోని కింద పడేస్తుంది. మీ అక్క చేత సంతకం పెట్టించలేక పోయావని ధనతో శ్రీలత అనగానే‌.. మీరు నా కంటే పెద్ద వారు.. మీరే ఏం చెయ్యలేదని ధన అంటాడు. మరొకవైపు సీతాకాంత్ తన తల్లి చేసిన మోసాన్ని గుర్తుచేసుకుంటాడు‌ అప్పుడే రామలక్ష్మి వస్తుంది. అందరు నన్ను జాలిగా చూస్తుంటే భరించలేకపోతున్నానని రామలక్ష్మితో సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.