English | Telugu

Illu illalu pillalu..కొత్త కోడలిని శోభనానికి రెడీ చేసిన అత్త.. గదిలోకి వెళ్ళకుండా ఆపేసిన కామాక్షి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -41 లో.....ప్రేమని ఇంటికి త్వరగా రమ్మని సేనాపతి ఫోన్ చెయ్యగానే.. ప్రేమ ఇంటికి వస్తుంది. నీకు ఇప్పుడు పెళ్లి చూపులు.. మంచి సంబంధం.. వెళ్లి త్వరగా రెడీ అవ్వమని భద్రవతి చెప్పగానే.. ప్రేమ షాక్ అవుతుంది. ఆ తర్వాత ప్రేమ రెడీ అవుతుంది. కళ్యాణ్ అదే పని గా ఫోన్ చేస్తుంటాడు కానీ ప్రేమ ఫోన్ లిఫ్ట్ చెయ్యదు.

ఆ తర్వాత పెళ్లిచూపులకి అబ్బాయి వాళ్లు వస్తారు. ప్రేమ హాల్లో కి వస్తుంది. ప్రేమని చూసి అబ్బాయి నచ్చిందని చెప్తాడు. ప్రేమ బయటకి వెళ్లి కళ్యాణ్ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటి అలా వెళ్లిపోయావ్.. ఫోన్ లిఫ్ట్ చెయ్యడం లేదని కళ్యాణ్ అనగానే.. నాకు పెళ్లి చూపులు జరిగాయి.

నేను తర్వాత మాట్లాడుతానంటూ ఫోన్ కట్ చేస్తుంది ప్రేమ. అప్పుడే ధీరజ్ ఎదురింట్లో నుండి చూసి.. ఏంటి ఈ రోజు ఇంత అందంగా రెడీ అయ్యావని అడుగుతాడు. ఓహ్ పెళ్లి చూపులా అని ధీరజ్ అంటాడు. నేను మీ అన్నయ్యకి ఫోన్ చెయ్యలేదు వట్టిగనే బెదిరించాను.. ఇంకొకసారి ఆ కళ్యాణ్ తో కనిపిస్తే నిజంగానే చెప్తానని ధీరజ్ అంటాడు. అంటే వాడు కళ్యాణ్ గురించి ఇంట్లో వాళ్లకి చెప్పలేదా.. అంటే వీళ్ళే పెళ్లి చూపులు ఏర్పాటు చేసారా అని ప్రేమ అనుకుంటుంది.

మరొకవైపు నర్మదని శోభనానికి రెడీ చేస్తారు. సాగర్ ని రెడీ చేస్తాడు తిరుపతి.

నర్మద అందంగా ఉందని వేదవతి మురిసిపోతుంది. ఆ తర్వాత నర్మదని గదిలోకి వెళ్లకుండా కామాక్షీ ఆపుతుంది. తరువాయి భాగంలో రెండు రోజుల్లో పెళ్లి చెయ్యాలి అమెరికాకి తీసుకొని వెళ్తామని పెళ్లి వాళ్ళు అంటున్నారని భద్రవతి ఇంట్లో వాళ్ళకి చెప్పాగానే.. చేద్దామని విశ్వ అంటాడు. దాంతో ప్రేమ కోపంగా పైకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.