English | Telugu

Eto Vellipoyindhi Manasu : కొడుకును మోసం చేసిన తల్లి !

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -128 లో.....శ్రీలత, సందీప్ లు ప్రొద్దునే మాట్లాడుకుంటే ఉంటే అది చూసి రామలక్ష్మి ఏమైంది ఇంత ప్రొద్దున్నే ఏం మాట్లాడుకుంటున్నారని అనుకుంటుంది. అప్పుడే ఒక స్వామి శ్రీలత దగ్గరికి వస్తాడు. అతనికి శ్రీలత డబ్బులు ఇస్తుంది. అది చూసిన రామలక్ష్మి వీళ్ళు ఎందుకు అతనికి డబ్బులు ఇస్తున్నారు.. ఏదో ప్లాన్ చేస్తున్నారు అది వినిపించడం లేదని రామలక్ష్మి అనుకుంటుంది. ఆ తర్వాత శ్రీలత, సందీప్ లు సీతాకాంత్ దగ్గరికి వెళ్లి.. నీ కోసం స్వామి ప్రసాదం పంపించారని శ్రీలత చెప్తుంది. ఆ ప్రసాదం శ్రీలత డబ్బులు ఇచ్చిన అతను తీసుకొని వస్తాడు.

అవునా అంటూ సీతాకాంత్ ప్రసాదం తినపోబోతుంటే వద్దని ఆపుతుంది. దాంతో ప్రసాదం కిందపడిపోతుంది ఏమైందని సీతాకాంత్ అడుగుతాడు. అందులో ఏదో కలిపారని రామలక్ష్మి అంటుంది. అదేం లేదు ప్రసాదం నాకు ఎప్పుడు స్వామి పంపిస్తాడని సీతాకాంత్ అంటాడు. అయినా రామలక్ష్మి వినదు. అయితే ముందు మీ అమ్మని తినమనండి అని రామలక్ష్మి అనగానే.. అందరు షాక్ అవుతారు. అంటే నేనే అందులో ఏదో కలిపాను అంటున్నావా అని శ్రీలత అంటుంది. ఎందుకు అందరిని కాదని నన్నే ఎందుకు తినమంటున్నావని శ్రీలత అడుగుతుంది. ఎందుకంటే ఇందాక ఇతనికి డబ్బులు ఇవ్వడం నేను చూసానని రామలక్ష్మి అంటుంది. దాంతో తన తల్లిని సీతాకాంత్.. అది నిజమేనని అడుగుతాడు. అతను ఇక్కడే ఉన్నాడు కదా అతన్నే అడగండి అని శ్రీలత అంటుంది. దాంతో సీతాకాంత్ అతన్ని అడుగగా.. ఇచ్చింది.. అవి ఆశ్రమానికి డొనేట్ చేసిందని అతను చెప్తాడు. మరి ఆ విషయం ఎవరికి తెలియొద్దని ఎందుకు అన్నారని రామలక్ష్మి అంటుంది. అలా చేసిన హెల్ప్ ఎందుకు చెప్పుకోవడమని సందీప్ అంటాడు.

మీరు ఆ స్వామికి ఫోన్ చేసి కనుక్కోండి అని రామలక్ష్మి అనగానే సీతాకాంత్ స్వామికి ఫోన్ చేసి.. మీరు ప్రసాదం పంపారా అని అడుగుతాడు. అవును పంపాను అని స్వామి చెప్తాడు.ఆ తర్వాత సీతాకాంత్ ప్రసాదాం తినబోతుంటే నేను తింటానని రామలక్ష్మి ముందు తింటుంది. ఇప్పుడు తిన్నావు కదా ఏమైంది అనవసరంగా మన అత్తయ్య మీద అనుమానపడ్డావని శ్రీవల్లి అంటుంది. నాకు సీతా అంటే చాలా ఇష్టం.. వాడిని కంటికి రెప్పలా పెంచాను. నీ కోసం ప్రాణం ఇవ్వడానికి రెడీ అంటూ శ్రీలత కత్తితో చెయ్యి కోసుకుంటుంది. దంతో నా తల్లికి నాపై ఎంత ప్రేమ ఉందో తెలుసు దాన్ని ఎవరికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు.. ఇంకొకసారి నా తల్లిని బాధ పెట్టకు రామలక్ష్మి అని సీతాకాంత్ చెప్తాడు. మా అమ్మని నువ్వు ఈ రోజు అవమానించావ్ వదిన అని సిరి అంటుంది. పెద్దాయన కూడా వచ్చి.. నువ్వు ఎక్కడో పొరపాటు పడ్డావ్ రామలక్ష్మి అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.