English | Telugu

Eto Vellipoyindhi Manasu : రామలక్ష్మి జాతకం బాలేదని స్వామి.. నీకెలా చెప్పాలని సీతాకాంత్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -114 లో.... నేను వాళ్ళ పెళ్లి మళ్ళీ జరిపిస్తానని స్వామికి శ్రీలత చెప్తుంది. ఆ తర్వాత సీతాకాంత్ బయటకు వచ్చి.. స్వామి వెళ్తుంటే ఆపి మాట్లాడుతాడు. నేను, రామలక్ష్మి పెళ్లి చేసుకున్నట్లు నాటకం అడుతున్నామని చెప్పాను కదా.. మళ్ళీ మీరు ఎందుకు ఇలా చెప్పారని సీతాకాంత్ అడుగుతాడు. అది దైవ నిర్ణయం నాతో పలికించాడని స్వామి చెప్తాడు.

ఆ తర్వాత రామలక్ష్మి టెన్షన్ పడుతూ.. మీ ఆలోచన ఏంటి? మీ మౌనం వెనక ఉన్న ఉద్దేశమేంటి? నాకు అర్థం కావడం లేదని సీతాకాంత్ ని అడుగుతుంది. రేపు మనల్ని హోమంలో కూర్చోమన్నారు.. ఆ తర్వాత మీరు నా మెడలో తాళి కట్టాలని చెప్పారు.. దానికి మీరు నిజం చెప్తారనుకున్నాను.. మేమ్ భార్యాభర్తలం కాదు.. సిరి, ధనల కోసం ఇలా చేశామని అందరి ముందు చెప్పకుండా మౌనంగా ఎందుకున్నారని రామలక్ష్మి అడుగుతుంది. ఆడపిల్ల మెడలో తాళి అంటే అది మానసిక బంధం.. రేపు మీరు నా మెడలో తాళి కడితే నా పరిస్థితి ఏంటని రామలక్ష్మి అడుగుతుంది. రేపు హోమం మాత్రమే జరుగుతుంది.. నేను నీ మెడలో తాళి కట్టనని సీతాకాంత్ అంటాడు. మరి హోమం ఎందుకని రామలక్ష్మి అడుగుతుంది. రామలక్ష్మి జాతకం బాలేదని స్వామి చెప్పిన విషయం గుర్తుకుచేసుకొని.. ఈ విషయం నీకెలా చెప్పాలని సీతాకాంత్ అనుకుంటాడు.

ఆ తర్వాత పూజకు అన్ని ఏర్పాట్లు చేస్తారు. శ్రీలత, సిరిలు రామలక్ష్మి దగ్గరకు వెళ్తారు. ఇంకా రెడీ అవ్వలేదా అని శ్రీలత అడుగుతుంది. మీ అమ్మనాన్నలని పిలిచావా అని శ్రీలత అడుగగా.. వాళ్ళెందుకని రామలక్ష్మి అంటుంది. వాళ్ళ కూడా మీ పెళ్లి చూడలేదని.. వాళ్ళని పిల్వకపోతే ఎలా అని శ్రీలత అనగానే.. నువ్వేనా ఇలా అంటుంది. ఆ రోజు నువ్వే వాళ్లని ఇక్కడకు వద్దన్నావని శ్రీలతని సిరి అడుగుతుంది. కూతురు పెళ్లి జరుగుతుంటే వద్దనేంత కసాయి దాన్ని కాదని శ్రీలత అంటుంది. ఆ తర్వాత సందీప్, శ్రీలత కలిసి మాణిక్యం ఇంటికి వెళ్లి జరిగింది చెప్తారు. పూజకు రమ్మని శ్రీలత పిలుస్తుంది. ఇందులో ఏదో ఉంది.. ఈవిడ వచ్చి పిలుస్తుందని మాణిక్యం డౌట్ పడతాడు. మరొకవైపు రామలక్ష్మి ఎగ్జామ్ కు సెలక్ట్ అయ్యారు. మీరు ఢిల్లీకి వెళ్లి కోచింగ్ తీసుకోవచ్చని ఫోన్ చేసి చెప్పగానే.. రామలక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. ఏంటి అన్నయ్య ఇంకా రెడీ అవ్వలేదని సిరి అనగానే.. నువ్వు వెళ్ళు మేమ్ రెడీ అవుతామని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.