English | Telugu
రేవతిపై అరిచిన ఈశ్వర్.. ఏమైందని నిలదీసిన భవాని!
Updated : Apr 16, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -132 లో.. కృష్ణని తీసుకురావడానికి మురారి కాలేజీకి వెళ్తాడు. మురారి వెళ్లేసరికి కృష్ణ, గౌతమ్ దగ్గర ఉంటుంది. అక్కడ గౌతమ్ క్యాబిన్ పై షాపింగ్ చేసిన కవర్లు ఉంటాయి. అది చూసి పెళ్ళి షాపింగ్ కూడా అయిపోయిందా అని మురారి అడుగుతాడు. కృష్ణ, గౌతమ్ లు డల్ గా కనిపించడంతో వాళ్ళని చూసిన మురారి.. "ఏమైంది.. ఏమైనా ప్రాబ్లమా?" అని అడుగుతాడు. అవును సర్ అమ్మాయి తరపున ప్రాబ్లమ్ అని కృష్ణ అంటుంది. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏదైనా సరే పెళ్లి నేను చేస్తాను.. అవసరం అయితే అమ్మాయిని తీసుకొచ్చి నందు రూమ్ లో పెడదామని మురారి అనగానే కృష్ణ షాక్ అవుతుంది. ఎందుకంటే అమ్మాయే నందు కాబట్టి. "మీరేం ఆలోచించకండి అంతా నేను చూసుకుంటాను" అని మురారి అంటాడు. ఆ తర్వాత కృష్ణని తీసుకొని వెళ్తాడు.
మరోవైపు పెళ్లికొడుకు కిరణ్, భవానికి ఫోన్ చేసి.. నందుకి పెళ్ళి బట్టలు షాపింగ్ చేద్దామని అనుకుంటున్నాము.. ఎవరైనా వస్తారా అని అడుగుతాడు. మేము నందుకి తీసుకుంటాం.. మీరు తీసుకోండి డబ్బులు పంపిస్తానని భవాని అంటుంది. ఆ తర్వాత డబ్బులు ఈశ్వర్ తో పంపిద్దామని భవాని అనుకుంటుంది. ఇంతలో ఈశ్వర్, రేవతి లు గొడవ పడుతుంటారు. రేవతి మీద అరుస్తాడు ఈశ్వర్. అప్పుడే అక్కడకి వచ్చిన భవాని ఏమైంది? ఎందుకు అలా రేవతిపై అరుస్తున్నావ్ ఈశ్వర్? నేను ఇంట్లో ఉన్నప్పుడే ఇలా అరుస్తున్నావ్.. లేనప్పుడు ఇంకెలా అరుస్తావో అని అడుగుతుంది. మీ ముగ్గురు కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారని రేవతి తన మనసులో అనుకుంటుంది. మరోవైపు కృష్ణ, మురారి ఇద్దరు కలిసి ఇంటికి కార్ లో వస్తుంటారు. నిన్ను ఇంట్లో వాళ్ళు ఏమైనా అంటున్నారా? మొదట్లో ఏదైనా చెప్పేదానివి.. ఇప్పుడు చెప్పట్లేదు.. ఉమ్మడి కుటుంబంలో నీకు సపోర్ట్ చేస్తూ మాట్లాడలేను కృష్ణా.. అలా సపోర్ట్ చేస్తే కుటుంబంలో గొడవలు అవుతాయని కృష్ణతో మురారి అంటాడు. అవును సర్.. మీ కుటుంబం చూస్తే తెలుస్తుంది. నాకు కుటుంబం లేదు కదా అని కృష్ణ బాధగా అంటుంది. కృష్ణ బాధని పోగొట్టడానికి రెస్టారెంట్ వెళ్దామని మురారి అంటాడు. అలా వచ్చిన కార్ లోనే వెనక్కి వెళ్తారు ఇద్దరు.
మరోవైపు మురారి కోసం ముకుంద ఎదురు చూస్తుంటుంది. పెళ్లి పనులు ఉన్నాయి. ఈ మురారి ఇంకా రాలేదేంటి అని అనుకుంటుంది ముకుంద. ఇది వరకు ముకుందతో వెళ్ళిన రెస్టారెంట్ కే కృష్ణ, మురారి వెళ్తారు. అక్కడ వెయిటర్ వాళ్ళిద్దరిని చూసి.. అప్పుడు పెద్ద అక్క, ఇప్పుడు చిన్న అక్క అని మురారి వాళ్ళతో అంటాడు వెయిటర్. ఇది వరకు ఎవరితో అయినా వచ్చారా సర్ అని కృష్ణ అడగగానే.. లేదని అంటాడు మురారి. ఇక స్వీట్ ఆర్డర్ చేసి కృష్ణ, మురారిలు ఒకరికొకరు తినిపించుకుంటూరు. అది చూసిన వెయిటర్ అప్పుడు పెద్ద అక్కతో వచినప్పుడు అలా చేశారు.. ఇప్పుడు ఇలా చేస్తున్నారు అంటూ ఫోన్ లో మాట్లాడినట్లుగా.. వీళ్ళ దగ్గర అంటాడు వెయిటర్. కృష్ణని బయటకు పంపించి మురారి బిల్లు కట్టేసి వస్తానని వెయిటర్ దగ్గరికి వెళ్ళి.. నాలుగు తన్ని వస్తాడు. మురారి, కృష్ణ ఇక ఇద్దరు ఇంటికి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.