English | Telugu

జబర్దస్త్ ని మానస్ ని నేను చూసుకుంటా

జబర్దస్త్ షోకి ఈ మధ్య హోస్ట్ రష్మీతో పాటు మరో యాంకర్ గా మానస్ జాయిన్ అయ్యాడు. ఐతే బ్రహ్మముడి సీరియల్ లో మానస్ దీపికతో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక మానస్ ఏ షోకి వెళ్లినా ఆ షోకి దీపికా కూడా కచ్చితంగా వెళ్తుంది. ఆదివారం విత్ స్టార్ మా పరివారం, డాన్స్ ఐకాన్ సీజన్ 2 , చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే ఈ షోస్ లో తన కామెడీతో టిఆర్పీ రేటింగ్స్ ని ఎక్కడికో తీసుకుపోయింది. ఐతే ఈ మధ్య దీపికా హడావిడి షోస్ లో కొంచెం తగ్గింది. ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో జబర్దస్త్ రష్మీ సీటుకే ఎసరు పెట్టింది. తానూ జబర్దస్త్ యాంకర్ గా రావాలనుకుంటున్నట్టు చెప్పింది.

ఎందుకంటే మానస్ ఉన్నాడుగా అంటోంది. "మానస్ ఇప్పుడు జబర్దస్త్ లో రష్మీకి కో-యాంకర్ గా చేస్తున్నాడుగా అది నాకు సంతోషంగా అనిపిస్తోంది. ఐతే నన్ను మానస్ పక్కన పెట్టలేదు అని అనిపిస్తోంది" అనేసింది దీపికా. దాంతో రష్మీ గత ఎపిసోడ్ లోని ఒక డైలాగ్ ఉంది. అదేంటంటే "ఓయ్ నాకు కరెక్టో కాదో నన్ను కూడా అడగండి" అనే డైలాగ్ క్లిప్ ని ఇక్కడ యాడ్ చేశారు. "క్లైమేట్ బాగుంది కదా. ఒక నెల రోజులు స్విజర్ ల్యాండ్ వెళ్లి రండి. జబర్దస్త్ ని మానస్ ని నేను చూసుకుంటా." అని దీపికా చెప్పేసరికి రష్మీ జబర్దస్త్ లో షాకైన ఫేస్ క్లిప్ ని ఇక్కడ యాడ్ చేసి చూపించారు. "ఆన్ స్క్రీన్ లో ఏ హీరోతో ఐనా రొమాంటిక్ సీన్ చేయడానికి నేను రెడీ. వాళ్ళే సిగ్గుపడతారేమో కానీ నాకు ఏ మొహమాటం లేకుండా చేసేస్తా. విజయ్ దేవరకొండ గారితో రష్మీక గారి సీన్ కంటే నేనే కిస్సింగ్ బాగా చేస్తా తెలుసా" అని నవ్వుతూ చెప్పేసింది. దీపికా ఎం మాట్లాడినా అది వైరల్ ఐపోతుంది. ఎందుకంటే తెలుగు కొంతవరకు సరిగా తెలీదు దాంతో ఆమె మాట్లాడే మాటలు చిరాకు అనిపించినా నవ్వు తెప్పిస్తాయి దాంతో ఆమెను షోస్ లో తీసుకుంటున్నారు మేకర్స్.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.