English | Telugu

వంటలయ్యగా మారిన డాక్టర్ బాబు!

కార్తీక దీపం సీరియల్ అంటే చాలు డాక్టర్ బాబు, వంటలక్క గుర్తొస్తారు. సీరియల్ ఐపోయినా ఈ క్యారెక్టర్స్ ని మాత్రం ఎవరూ మర్చిపోవడం అంత ఈజీ కాదు. వాళ్ళ అసలు పేర్ల కంటే కూడా సీరియల్ లో పేర్లతోనే ఎక్కువగా పాపులర్ అయ్యారు. సీరియల్ ఐపోయాక వంటలక్క, డాక్టర్ బాబు ఎవరి పనుల్లో వాళ్ళు, ఎవరింట్లో వాళ్ళు బిజీ ఐపోయారు. ఐతే ఇప్పుడు డాక్టర్ బాబు వంటలయ్య అవతారం ఎత్తాడు. ఇంట్లో తన సుపుత్రుడి కోసం మంచి టేస్టీ వంటకం చేసాడు.

మంజుల పరిటాల తన కొడుకు చదువుకుంటుండగా వెళ్లి ఏమన్నా తింటావా..ఏం చేసి పెట్టను అది అడిగింది. రెగ్యులర్ వి అస్సలు వద్దు...కొత్తగా..టేస్టీగా ఏమన్నా చెయ్యి అని అడిగాడు. ఇది ఇల్లు.. హోటల్ కానీ, బేకరీ కానీ కాదు కదా...అని సీరియస్ అయ్యింది. అలా ఐతే ఏం వద్దు అని మారాం చేస్తుండగా అక్కడికి డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల వచ్చి విషయం ఏమిటి అని అడిగాడు. ఇక మంజుల జరిగింది మొత్తం చెప్పేసరికి...సరే నీకు స్పెషల్ రెసిపీ చేస్తాను అని మంజులను వంటగదిలోకి తీసుకెళ్లి ఆనియన్స్, రెడ్, ఎల్లో, గ్రీన్ కాప్సికం ముక్కలుగా కట్ చేసి నాలుగు ఎగ్స్ తీసుకుని అన్ని మిక్స్ చేసాడు. తర్వాత బ్రెడ్ స్లైసెస్ తీసుకుని బోర్డర్స్ కట్ చేసి ఆ బోర్డర్స్ ని పాన్ లో పెట్టి కొంచెం నెయ్యి వేసి ప్రిపేర్ చేసుకున్న మిక్స్ ని అందులో పోసి దాని మీద చీజ్, కట్ చేసుకున్న బ్రెడ్ పీస్ పెట్టి అటు ఇటు ఎర్రగా కాల్చి ఇచ్చాడు. ఇక వాళ్ళ అబ్బాయి అది తిని సూపర్ గా ఉంది అని లాగించేసాడు. దీన్నే ఎగ్ బ్రెడ్ చీజ్ టోస్ట్ అంటారు అని పేరు పెట్టాడు.

ఇక మంజుల ఎండింగ్ నోట్ ఇచ్చేసింది. మనం చేసుకుని మనమే తినాలంటే ఎక్కువ తినలేము కానీ వేరే వాళ్ళు చేసి పెడితే ఎంతైనా తినేస్తాం కదా.. మరి మీరేమంటారు అని తన ఫాన్స్ ని అడిగింది. ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్ లో వైరల్ అవుతోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.