English | Telugu

కారు యాక్టిడెంట్‌కి గురైన ఢీ కంటెస్టెంట్ భూమిక!

ఢీ షోలో భూమిక అంటే తెలియని వాళ్ళు లేరు. అలాంటి భూమిక ఢీ సీజన్ 20 లో తన డాన్స్ తో ఎంటర్టైన్ చేస్తోంది. ఇక లాస్ట్ సీజన్ లో ఐతే శేఖర్ మాష్టర్ ఈమె డాన్స్ కి గ్రేస్ కి ఫిదా ఇపోయారు. ఇక ఇప్పుడు కూడా కంటెస్టెంట్ గా చేస్తోంది భూమిక. రీసెంట్ గా ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. " ఈ ఐదు నెలల్లో నేను వెనకడుగు వేయడానికి కారణం ఇదే...ఇన్ని నెలలు ఏం చేస్తున్నావు, అకస్మాత్తుగా ఎందుకు కనిపించకుండా పోయావ్ ..? నువ్వు ఎక్కడా ఎందుకు యాక్టివ్ గా లేవు ? ఎందుకు లావయ్యావు ? అని నన్ను అడిగిన వారికి ఇదే నా జవాబు.

నేను కొత్తగా మళ్ళీ నన్ను నేను బలపరుచుకోవడానికి ఇన్ని నెలలు పట్టింది. ఎవరికైనా ఇలాంటి పరిస్థితి వస్తే బాధపడకండి....కొత్త శక్తితో తిరిగి రండి. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు చాలామంది మనల్ని వెనక్కి లాగడానికి చూస్తారు. కానీ లెజెండ్ బాబ్ ఏమన్నారో తెలుసా "నువ్వెంత బలంగా ఉన్నవో నువ్వు బలపడేవరకు నీకు తెలీదు అన్నారు. నేను మార్చ్ 19 న నాకు యాక్సిడెంట్ అయ్యింది. ఆ టైములో నాకు తగిలిన దెబ్బల వలన అంతా ఐపోయింది అనుకున్నా. నొప్పి నాతో నాట్యం చేసింది. ఆ దెబ్బల కారణంగా నేను వెయిట్ గైన్ అయ్యాను. కానీ నేను సంతోషంగా ఉన్నా ఎందుకంటే దేవుడు నన్ను బతికించాడు అని. అప్పుడే ఢీలోకి కం బ్యాక్ ఇవ్వాలనుకున్నా. ఢీకి థ్యాంక్స్ " అంటూ తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని పిక్స్ కి పోస్ట్ చేసింది భూమిక.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.