English | Telugu

పెళ్ళి అయింది సరే.. ఆ తర్వాత తంతు సంగతేంటి?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్‌-716 లో... కాలేజీ నుండి రిషి, వసుధార కార్ లో ఇంటికి వస్తుంటారు. తన మీద రిషికి ఉన్న కోపం తగ్గించడానికి ప్రేమగా మాట్లాడుతుంది వసుధార. ఆ తర్వాత ఇంటికి వెళ్తారు.

డైనింగ్ టేబుల్ దగ్గర వసుధార, రిషి, దేవయాని, జగతి, మహేంద్ర, ఫణీంద్ర భూషన్ అందరు కలిసి భోజనం చేస్తూ మాట్లాడుకుంటారు. అందరికి ధరణి వడ్డిస్తుంటుంది. ఎందుకు ధరణి ఇంత కష్టపడుతున్నావ్.. మాతో పాటు నువ్వు కూడా తినమని, కుర్చీలో కూర్చోమని చెప్తుంది దేవయాని. ఆ తర్వాత వసుధారని ఉద్దేశించి మాట్లాడుతుంది. ఎక్కడి వసయధార ఎక్కడికి వచ్చింది. కాలేజీ స్టూడెంట్ లాగా పరిచయమై మిషన్ ఎడ్యుకేషన్ కి హెడ్ అయింది.. ఇప్పుడు ఈ ఇంటికి కోడలు అయిందని వసుధారని ఉద్దేశించి ధరణితో చెప్తుంది దేవయాని. ఇప్పుడు అవన్నీ ఎందుకు అని వసుధార అడుగగా.. పెళ్ళి అయింది ఆ తర్వాత తంతు ఏమీ జరుగలేదు కదా.. అసలు పెళ్ళి అయిన ఇల్లులా ఉందా అని అందరితో చెప్తుంది దేవయాని. అది విని రిషి ఎందుకు పెద్దమ్మ ఇప్పుడు అవన్నీ అని అంటాడు. నీకేం తెలియదు ఊరుకో అని అంటుంది దేవయాని. ఆ తర్వాత దేవయాని పదే పదే సంప్రదాయాలు తంతు అంటూ జరిపించాలని చెప్తుంటే.. రిషి అక్కడ నుండి తినకుండా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రిషి, జగతి వాళ్ళ గదిలో కూర్చొని మాట్లాడుకుంటారు. అప్పుడే వారి దగ్గరికి వసుధార వస్తుంది. ఈ సమస్యని మీరిద్దరు అనుకొని సాల్వ్ చేసుకోవాలని వసుధారతో జగతి చెప్తుంది. దాంతో వసుధార ఆలోచిస్తూ రిషి గది వైపు వస్తుంది.

రిషి దగ్గరికి వసుధార వస్తుంది. ఏంటి ఇలా వచ్చావ్ అని రిషి అడుగగా.. ఏం లేదు సర్ పిల్లుల సౌండ్స్ వినిపిస్తే వచ్చానని వసుధార అంటుంది. ఇద్దరం ఎదురెదురుగా ఉన్నాం కానీ తెలియనంత దూరం మన మధ్యలో ఉందని వసుధార అనుకుంటుంది. నాతో ఏమైనా మాట్లాడాలా అదే పెద్దమ్మ అడిగినదాని గురించి నన్నేమైనా అడుగాలనుకుంటున్నావా అని రిషి అడుగగా.. నా మనసులో సమాధానాలే ఉన్నాయి సర్ ప్రశ్నలేమీ లేవని వసుధార అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.