English | Telugu

అద‌ర‌గొట్టిన 'డాన్స్ ప్లస్' గ్రాండ్ ఫినాలే.. విన్నర్ ఎవరంటే..?

బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ షోలకు కొదవ ఉండదు. ఎప్పటికప్పుడు కొత్త ఐడియాలతో కొత్త షోలను లాంచ్ చేస్తుంటారు. ప్రతీ ఛానెల్ లో ఎంటర్టైన్మెంట్ షోలు వస్తూనే ఉన్నాయి. డాన్స్, సింగింగ్, కామెడీ అంటూ ఎన్నో షోలను ప్రసారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్టార్ మాలో 'డాన్స్ ప్లస్' షో అనే షో మొదలైంది. గతేడాది 'బిగ్ బాస్' షో ముగిసిన తరువాత ఈ షో మొదలైంది. ఓంకార్ గా హోస్ట్ గా వ్యవహరించిన ఈ షోలో కొరియోగ్రాఫ‌ర్స్ యానీ, రఘు, యశ్, బాబా భాస్క‌ర్‌, తార‌లు ముమైత్ ఖాన్, మోనాల్ గజ్జర్ న్యాయనిర్ణేతలుగా కనిపించారు.

దాదాపు 21 వారాలుగా సాగిన ఈ షో ఆదివారం నాటి ఎపిసోడ్ తో ముగిసిపోయింది. గ్రాండ్‌ ఫినాలేకు శేఖర్ మాస్టర్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ ఫైనల్ గా వాసి టోనీ (యశ్వంత్‌ మాస్టర్‌ టీమ్‌), సంకేత్‌ సహదేవ్‌ (యశ్వంత్‌ మాస్టర్‌ టీమ్‌), మహేశ్వరి – తేజస్విని (బాబా మాస్టర్‌ బృందం), జియా ఠాకూర్ (యానీ మాస్టర్‌ బృందం), డార్జిలింగ్‌ డెవిల్స్‌ (రఘు మాస్టర్‌ బృందం) పోటీపడ్డారు.

కంటెస్టెంట్ లందరూ కూడా డిఫరెంట్ స్టైల్స్ లో డాన్స్ చేసి మెప్పించడానికి ప్రయత్నించారు. కానీ ఫైనల్ గా సంకేత్ సహదేవ్ విన్నర్ గా నిలిచి ట్రోఫీ అందుకున్నాడు. అంతేకాదు రూ. 20 లక్షలు బహుమతిగా గెలుచుకున్నాడు. ట్రోఫీని శేఖర్ మాస్టర్ చేతుల మీదుగా సంకేత్ కు అందించారు. మొత్తానికి ఈ షో వ‌ల్ల ఓంకార్‌ ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా.. అన్నీ పక్కన పెట్టి స‌క్సెస్‌ఫుల్‌గా షోను పూర్తి చేయగలిగారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.