English | Telugu

వాళ్లే నాకు ఇన్స్పిరేషన్ అన్న మహేష్ బాబు!

డాన్స్ ఇండియా డాన్స్ సరికొత్తగా కొత్త కంటెస్టెంట్స్ తో కొత్త కొత్త పెర్ఫార్మెన్సులతో దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు ఈ వారం షో కూడా ఫుల్ ఎంటర్టైన్ చేసింది అందరిని. ఇక ఈ షోలో జడ్జిగా వచ్చిన సంగీత తన లవ్ స్టోరీని చెప్పారు. "ఒక అవార్డు ఫంక్షన్ లో నేను క్రిష్ కలిసాం. నేను బెస్ట్ సింగర్ అవార్డు ఇవ్వాల్సి వచ్చింది. నేనే అప్పుడు క్రిష్ పేరుని అనౌన్స్ చేసాను. కానీ అప్పటికి సింగర్స్ గురించి నాకు పెద్దగా తెలీదు. స్టేజి మీదకు వస్తున్న అందంగా కనిపించిన క్రిష్ ని ఫస్ట్ టైం చూసాను.

అంతే అక్కడే పడిపోయాను." అనేసరికి "ఆయన అవార్డు తీసుకోవడానికి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లిపోయారు" అని హోస్ట్ అకుల్ బాలాజీ అనేసరికి " లేదు నేనే ఆయన్ని నాతో తీసుకెళ్లిపోయా" అంటూ సంగీత నవ్వుతూ చెప్పింది. ఆ మాటకు మహేష్ బాబు పడీ పడీ నవ్వేసాడు. "అప్పుడే మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అదే టైములో క్రిష్ పెర్ఫార్మన్స్ టీవీలో చూస్తున్నా.. అప్పుడు మా అమ్మకు చెప్పాను ఇలాంటి అబ్బాయిని చూడు" అని . "ఏ టైములో చెప్పానో అలా తర్వాత ఇద్దరికీ మ్యారేజ్ ఐపోయింది" అని చెప్పింది. ఇక ఈ షోలో సూపర్ స్టార్ కృష్ణ పిల్లలైన మహేష్ బాబు, రమేష్ బాబుకి సంబంధించి ఒక డాన్స్ ని కంటెస్టెంట్స్ అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. షో ఫైనల్ లో మహేష్ బాబు, రమేష్ బాబు ఇద్దరూ కలిసి ఉన్న ఒక ఫోటో లామినేషన్ ని మహేష్ బాబుకి అందించారు హోస్ట్ అకుల్.

ఈ షో మీద మీ అభిప్రాయం ఏమిటి అని అడిగేసరికి "కంటెస్టెంట్స్ అంతా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చారు" అని చెప్పారు మహేష్ బాబు. అలాగే ఈ డాన్స్ ఇండియా డాన్స్ షో లో గెలిచిన వారికి ట్రోఫీ అందిస్తామని అనౌన్స్ చేయడంతో ఆ ట్రోఫీని కూడా మహేష్ బాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.