English | Telugu

యాంకర్స్‌ని తొక్కేసి.. ప్రీరిలీజ్ ఈవెంట్స్‌ని మింగేస్తున్న సుమ!

ఈ మధ్య బుల్లితెర మీద ప్రసారమవుతున్న షోస్ లో సుమ మీద సెటైర్లు వేయడం ఎక్కువగా చూడొచ్చు. లాస్ట్ ఇయర్ ఎండింగ్ ఒక షోలో తాను యాంకరింగ్ నుంచి తప్పుకుని రెస్ట్ తీసుకుంటాను అని చెప్పిన దగ్గర నుంచి ఈ సరదా సెటైరికల్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ ఐన "సుమ అడ్డా" షోలో కూడా ఆ కామెంట్స్ ని వినవచ్చు. "బింబిసార" లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన మరో లేటెస్ట్ మూవీ 'అమిగోస్' 10న రిలీజ్ అవుతున్న సందర్భంగా మూవీ టీం ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇంతలో కమెడియన్ తాగుబోతు రాజమౌళి మరో లేడీ కమెడియన్ సత్యశ్రీతో వచ్చి "కళ్యాణ్ రామ్..ఏ టీవీ షోకి రామ్ అనే అతన్ని కూడా తీసుకుని ఈ షోలో కూర్చోబెట్టిన మీరు అనేసరికి ఇది సుమ అడ్డా" అనే ఒక రేంజ్ లో చెప్పింది సుమ.

"ఇంత అందమైన అమ్మాయిని పెట్టుకుని ఆ తాగుడేంటి అని సత్య అడిగేసరికి "మేడం ఈ ప్రోగ్రాంకి రాజీవ్ కనకాల సర్ కూడా రాలేదు కదా..ఎందుకంటే ఆయనకు అందమైన పెళ్ళాం లేదు కదా" అనేశాడు ..ఆ మాటలకు సుమ షాక్ లో ఉండిపోయింది. ఇక ఫైనల్ గా లేడీ కమెడియన్ విద్యుల్లేఖ వచ్చి కళ్యాణ్ రామ్ పక్కన కూర్చుని "కళ్యాణ్ గారు నేను ట్రిపుల్ ఆర్ ఆడిషన్ కి వెళ్లాను " అనేసరికి " హీరోయిన్ కోసమా" అని సుమ అడిగింది. "కాదు కొమ్మా ఉయ్యాలా పాప క్యారెక్టర్ కోసం" అని విద్యు చెప్పేసరికి అందరూ పడీ పడీ నవ్వేశారు. "బ్రహ్మాజీ గారి వైకుంఠపాళీలో పెద్ద పాము ఉంది తెలుసా అదే మన సుమ" అని విద్యు సుమ మీద సెటైర్ వేసేసరికి "నేనెందుకు పామయ్యాను" అని సుమ డౌట్ గా అడిగింది. "అంతమంది యాంకర్స్ ని తొక్కేసి ప్రతీ ప్రీరిలీజ్ ఈవెంట్స్ ని మింగేశారు కదా" అని మరో రియల్ జోక్ వేసేసింది. దానికి సుమ కూడా చాలా ఫన్నీగా ఎక్స్ప్రెషన్ ఇచ్చింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.