English | Telugu

చిరు నుంచి ప్రశంసలు అందుకున్న అయ్యన్ ప్రణతి


తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 లో 14 ఏళ్ళ అయ్యన్ ప్రణతి తన పెర్ఫార్మెన్స్ తో అదరగొడుతోంది. ఈ చిన్నారికి రోజురోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతోంది. అలాంటి ప్రణతి ఈ వారం చిత్ర గారి పాట" నిన్ను కోరి వర్ణం" పాడింది. కానీ ఆ సాంగ్ లో చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ ని జడ్జెస్ అంతా చెప్పారు. ఏజ్ తక్కువే కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయాలనీ...ఇంకా చక్కగా నేర్చుకోవాలని టిప్స్ ఇచ్చారు. అయ్యన్ ప్రణతి టాలెంట్ ఎలాంటిది అంటే గత ఎపిసోడ్స్ లో సర్ మూవీ నుంచి "మాస్టారు..మాస్టారు" సాంగ్ పాడి అందరినీ ఫిదా చేయడమే కాదు ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ ని కూడా పడేసింది. ఆయన ఆ చిన్నారికి బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చేసారు. ఇక ఇప్పుడు చిరంజీవి వంతు వచ్చింది.

ఆయన అయ్యన్ ప్రణతిని తన ఇంటికి ఆహ్వానించారు. చిరంజీవి, సురేఖ దగ్గర కూర్చోబెట్టుకుని ప్రణతి చేత అన్నమాచార్య కీర్తనలు పాడి వినిపించుకున్నారు. తన వైఫ్ కి అన్నమాచార్య కీర్తనలు అంటే ఎంతో ఇష్టం అని కూడా చిరంజీవి చెప్పారు. తరవాత ప్రణతితో కలిసి అందరూ ఫొటోస్ కూడా దిగారు. "నా ఫీలింగ్ మాములుగా లేదు. నన్ను తన గ్రాండ్ డాటర్ లా చూసుకున్నారు. అంతా లెజెండరీ పర్సన్ ముందు ఎలా నడుచుకోవాలో నాకు అర్ధం కాలేదు. కానీ ఆయన చాలా హంబుల్ పర్సన్. నేను అక్కడి నుంచి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు కూడా నేను ఆ షాక్ లోనే ఉన్నాను. నిజంగానే ఆయన్ని కలిసానా అని..ఇదంతా తెలుగు ఇండియన్ ఐడల్ వల్లనే" అని ప్రణతి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. "నువ్వు సురేఖ మేడం ఫ్యాన్ వి. అంటే చిరంజీవి గారి ఇంట్లో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 మోగుతోంది. సూపర్బ్ ..నాకు చాలా హ్యాపీగా ఉంది" అన్నాడు హేమచంద్ర.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.