English | Telugu

పొట్ట కోస్తున్నారు...పాట పాడమన్నారు...కట్ చేస్తే చిన్మయి భజన పాడుతోంది

"అలా మొదలయ్యింది" షోలో వచ్చే సెలబ్రిటీస్ చెప్పే విషయాలు ప్రతీ వారం ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి. అలాంటి షోకి ఈ వారం సింగర్ చిన్మయి శ్రీపాద, యాక్టర్ రాహుల్ రవీంద్రన్ ఇద్దరూ జంటగా వచ్చారు. అందులో ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు.." డెలివరీ టైంలో ఏదో విషయం జరిగిందట కదా...చాలా ఎమోషనల్ కూడా అయ్యారట.. అదేంటో షేర్ చేసుకుంటే బాగుంటుంది అని కిషోర్ అనేసరికి " నా లైఫ్ లో చిన్నూ డెలివరీని అస్సలు మర్చిపోలేను. డెలివరీకి ఇంకా వన్ వీక్ టైం ఉంది...రొటీన్ చెకప్ కి వెళ్ళినప్పుడు టెక్నికల్ గా డాక్టర్ ఏదో విషయం చెప్పారు.

రేపటి కల్లా సిజేరియన్ చేయాలి అని..అంతా ప్రిపేర్ చేసుకున్నాం. రెండో రోజు చిన్మయిని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లారు. నేను కూడా తనతో ఉండాలి కదా అని లోపలి వెళ్లాను...చిన్మయి మీద ఫుల్ గా బ్లాంకెట్ ఒకటి కప్పేసరికి తనకు ఏమీ కనిపించడం లేదు. చిన్మయి బెడ్ మీద పడుకునేటప్పుడు బ్లూ టూత్ పెట్టి ఒక శ్లోకం ఆన్ చేసింది. ఆ శ్లోకం వింటూ పిల్లలు పుట్టాలని. కానీ డాక్టర్ ఎం చేశారంటే బ్లూ టూత్ ఆఫ్ చేసి నువ్వు పాడమ్మా అన్నారు..ఏం మాట్లాడుతున్నారు మీరు ... అక్కడ కట్ చేస్తున్నారు బ్లడ్ వస్తోంది..పాట పడమంటున్నారేంటి అని నేను అడిగేసరికి ఏం కాదు నువ్వు పాడమ్మా అని చిన్మయికి చెప్పారు.

తనకు అనెస్థీషియా ఇచ్చారు కదా తనకు ఏం జరుగుతోందో తెలియడం లేదు...తాను మాములుగానే పాడుతూ ఉంది..అది చూసేసరికి నేను కళ్ళు తిరిగి పడిపోయాను. డాక్టర్స్ తమ పనిలో తాము ఉంటే చిన్మయి భజన పాడుతోంది. కట్ చేస్తే ట్విన్స్ పుట్టారు. వాళ్ళను తీసుకొచ్చి ముందుగా నా చేతుల్లో పెట్టారు. ధ్రిప్తని చిన్నూ పక్కన పడుకోబెట్టగానే చిన్న నవ్వు నవ్వింది. నేను అవుట్..నా కూతురు, నా భార్య నవ్వుతున్నారు నేను షాక్ నిజంగా.." అని రాహుల్ రవీంద్రన్ చెప్పేసరికి "ఆ హాస్పిటల్ లో ఆ రోజు ఏడుస్తూ ఒక వీడియో తీసుకున్నాడు. ఆ రోజు తనకు స్పెషల్ డే అనే విషయం ఎప్పటికీ గుర్తుండాలి అది దాచుకున్నాడు. అది పిల్లల 18 వ బర్త్ డే ఇద్దామని ఉంచారు" అని చెప్పింది చిన్మయి.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.