English | Telugu

షీ ఈజ్ ఏ ట్రూ పాన్ ఇండియా యాక్ట్రెస్!


చెఫ్ మంత్ర సీజన్ 2 ప్రతీ వారం మంచి జోష్ తో సాగిపోతోంది. ఇక ఇప్పుడు ఈ ప్రోగ్రాం లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ప్రగతి 25 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉంది అలాంటి ప్రగతికి జోడి గెస్ట్ గా 25 ఏళ్ళ వయసున్న నిధి అగర్వాల్ ని గెస్ట్ గా తీసుకొచ్చింది మంచు లక్ష్మి. నిధి అగర్వాల్ ని మంచు లక్ష్మి ఈ షో మొత్తం సరదాగా ఆట పట్టించేసింది.

"ఏమిటి తెలుగు నేర్చుకోలేదా ఎక్కడా" అని అడిగేసరికి " నేను తెలుగు నేర్చుకున్నాను నాకు తెలుగు తెలుసు" అని ఆన్సర్ ఇచ్చింది నిధి. తర్వాత "షీ ఈజ్ ఏ ట్రూ పాన్ ఇండియా యాక్ట్రెస్" అని నిధి ప్రగతికి సూపర్ కంప్లిమెంట్ ఇచ్చేసింది. ఇక నిధి, ప్రగతితో చపాతీలు చేయించింది.."చిన్నప్పటి నుంచి నువ్వు యాక్టర్ అవ్వాలనుకున్నావా" అని లక్ష్మి అడిగేసరికి "పుట్టినప్పటినుంచి యాక్టర్ అవ్వాలనుకున్నా" అని ఆన్సర్ చేసింది నిధి.

"నిధి నువ్వు చేసిన మొదటి వంటకం ఏమిటి" అని అడిగింది లక్ష్మి.."చాయ్ చేసాను" అని ఫన్నీగా ఆన్సర్ చేసింది.."పవన్ కళ్యాణ్ గారిని ఏమని పిలుస్తావ్ " అని అడిగేసరికి " సర్" అని పిలుస్తానంటూ జవాబిచ్చింది. ఇలా రాబోయే వారం ఈ ముగ్గురూ మంచి ఎంటర్టైన్మెంట్ అందించనున్నారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.