English | Telugu

కార్తీక్ ని పెళ్లి చేసుకుంటానంటోన్న చారుశీల

శనివారం రోజు ఎపిసోడ్‌లో పూజ గదిలో పూజ చేసుకుంటుంది దీప. అలా దీప పూజ చేస్తుండగా చారుశీల వస్తుంది. "నేను నీ గురించి అనుకునే లోపే నువ్వే టవచ్చావ్. లోపలికి వెళ్దాం.. నీతో మాట్లాడాలి" అని చారుశీలతో అంటుంది దీప. చారుశీల మాట్లాడుతూ "ఒక్క నిమిషం అక్క.. నేను కూడా మొక్కుకొని వస్తా" అని తులసి చెట్టుకు దండం పెట్టుకుంటుంది. "కార్తిక్ తో నా పెళ్ళి జరగాలి" అని వేడుకుంటుంది. ఆ తరువాత ఇద్దరు లోపలికి వెళ్లి మాట్లాడుకుంటారు.

మరో వైపు శౌర్య, హేమచంద్ర మాట్లాడుకుంటారు. "మా అమ్మ నాన్నల ఆచూకీ గురించి ఏమైనా తెలిసిందా?" అని హేమచంద్రతో అంటుంది శౌర్య. దానికి హేమచంద్ర మాట్లాడుతూ "శౌర్య.. నీ ఫోటో ఒకటి కావాలి" అని అడుగుతాడు. దానికి శౌర్య "వెతకాల్సింది నన్ను కాదు. మా అమ్మనాన్నలని. నా ఫోటో ఎందుకు?" అని అంటుంది. అప్పుడు హేమచంద్ర "ఎక్కడైనా మీ అమ్మనాన్నలు కన్పిస్తే.. నీ ఫోటో చూపించి, మీ కూతురు మీ కోసం వెతుకుతుందని చెప్తాను" అని అంటాడు. దానికి శౌర్య "మీరు చెప్పింది నిజమే. ఫోటో ఎందుకు అంకుల్. సెల్ఫీ దిగుదాం. అది చూపిస్తే మనం ఫ్రెండ్స్ అనుకుంటారు" అని శౌర్య చెప్తుంది. ఆ తర్వాత ఇద్దరు సెల్ఫీ దిగుతారు.

ఆ తర్వాత చారుశీల, దీప ఇద్దరూ గదిలోకెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. దీప మాట్లాడుతూ "నేను వెళ్ళిపోయాక.. డాక్టర్ బాబుకి ఒక తోడు కావాలి. ఆ తోడు నువ్వే వెతికి పెట్టాలి" అని చారుశీలని అడుగుతుంది. "ఒక తోడు కావాలి అంటున్నావు. కానీ ఆ తోడు నేనే కావాలని ఎందుకు అనుకోవట్లేదు. అయినా కార్తిక్ ని ఎలాగైనా నేనే పెళ్ళి చేసుకుంటాను కదా" అని మనసులో చారుశీల అనుకుంటుంది.

ఆ తర్వాత గండ, అతని భార్య మాట్లాడుకుంటారు. అలా వాళ్ళిద్దరు మాట్లాడుతున్నప్పుడు హిమ వస్తుంది. "సారీ బాబాయ్.. పిన్ని. మిమ్మల్ని నిన్ను తప్పుగా అర్ధం చేసుకున్నాను. నేను కావాలని ఏం అనలేదు" అని హేమ అంటుంది. దానికి గండ మాట్లాడుతూ "అదేం లేదమ్మా.. మాకు జ్వాలమ్మ ఎలాగో, నువ్వు అలాగే " అని చెప్పి వెళ్ళిపోతారు. ఆ తర్వాత హిమ గురించి శౌర్య, గండ మాట్లాడుకుంటారు. ఆనందరావు, హిమ ఇద్దరు కలిసి శౌర్య గురించి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.‌

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.