English | Telugu
బిగ్ బాస్ నుండి బయటకొచ్చేసిన చలాకి చంటి!
Updated : Oct 10, 2022
ప్రతి వారం బిగ్ బాస్ లో ఒకరు బయటకొచ్చేయడం కామన్ గా జరిగే విషయం. అయితే ఈ వారం ఎవరు ఊహించని వ్యక్తి ఎలిమినేట్ కావడం హౌస్ మేట్స్ అందరిని ఆశ్చర్యపరిచింది. కాగా చివరి వరకు ఉత్కంఠభరితంగా కొనసాగిన ఎలిమినేషన్ ప్రక్రియలో ఇనయా, చంటి ఇద్దరు మిగిలారు. అయితే లాస్ట్ లో చంటి ఎలిమినేట్ అయ్యాడు.
"గేమ్ లో ఎలాంటి పార్టిస్పేషన్ లేదు. గేమ్ బాగా ఆడు. టాస్క్ లో బాగా పర్ఫామెన్స్ చేయు." అని నాగార్జున ప్రతి వారం చెప్పాడు. అయినా సరే తన ఆటతీరులో ఎలాంటి మార్పు రాలేదు. ఎలిమినేట్ అయ్యాక హౌస్ నుండి నాగార్జున దగ్గరకు వచ్చేసాడు. ఆ తర్వాత చంటి మాట్లాడుతూ "కప్పు ఇంపార్టెంట్ కాదు. నేను మనసులు గెలుచుకున్న అది చాలు" అని నాగార్జునతో సరదగా చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత తన AV చూస్తూ కాస్త ఉద్వేగానికి లోనయ్యాడు. అయితే చంటి ఎలిమినేట్ అవ్వడానికి ముఖ్య కారణం గీతుతో గొడవే కారణం అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. చివరగా హౌస్ మేట్స్ తో మాట్లాడటానికి వచ్చాడు చంటి. నాగార్జున హౌస్ మేట్స్ ని చూసి "అందరు సైలెంట్ గా ఉన్నారేంటి? " అని అడుగగా, "మా నవ్వు అక్కడికి వెళ్ళిపోయింది సర్ అందుకే హౌస్ లో ఇంత సైలెన్స్" అని సుదీప చెప్పుకొచ్చింది.
ఆ తర్వాత నాగార్జున ఒక్కొక్కరి గురించి చంటిని చెప్పమన్నాడు. అతను మాట్లాడుతూ "రాజ్ అందరిని ఈజీగా నమ్మేస్తాడు. కీర్తి భట్ నువ్వు ఏం అనుకుంటున్నావో అదే చేయు. ఎక్కువగా ఏడ్వకు. బాధపడకు. సూర్య అందరిని ఎక్కువ ప్రేమిస్తాడు. శ్రీహాన్ కి ఎక్కడ ఎలా ఉండాలో చాలా క్లారిటి ఉంది. ఎవరితో ఎలా మాట్లాడాలో బాగా తెలుసు. ఫైమా బాధలో ఎవరు ఉన్న నవ్వించేలా చేస్తుంది. మెరీనా మదర్ ఇండియా.ఏ డెసిషన్ తీసుకున్న రోహిత్ ని అడిగి తీసుకుంటుంది. రేవంత్ చాలా మంచోడు. ఆదిత్య అతి మంచితనం వద్దు తీసేయ్" అని ఇలా ఒక్కొక్కరి గురించి చెప్పుకొచ్చాడు. చివరగా టైం అయిపోయిందని బయటకు పంపించేసాడు నాగార్జున. అయితే బిగ్ బాస్ లో తన కామెడితో అందరిని సరదగా నవ్వించే చంటి కూడా బయటకొచ్చేసాడు.