Read more!

English | Telugu

రోహిణిని ఎత్తుకున్న 'ఖైదీ' విలన్ అర్జున్ దాస్..అలా ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమ

బుల్లితెర మీద జబర్దస్త్ తో సమానంగా శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. యాంకర్ రష్మీ, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, నరేష్ ఈ షోలో ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు. రీసెంట్ గా  శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో రిలీజ్ అయ్యింది.  జనవరి 29న ప్రసారమయ్యే ఈ ఎపిసోడ్ చూస్తే సర్ప్రైజ్ అవకుండా ఉండరు.

"బుట్ట బొమ్మ" మూవీ టీం ఈ ఎపిసోడ్ కి ఎంట్రీ ఇచ్చింది. కార్తీ నటించిన "ఖైదీ" మూవీలో ఒక విలన్ గా నటించిన అర్జున్ దాస్ బుట్టబొమ్మ మూవీలో కూడా నటించాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా అనికా సురేంద్రన్ నటించింది. ఈమె హీరో అజిత్ నటించిన "విశ్వాసం" మూవీలో ఆయనకు కూతురిగా నటించింది. ఆమె కూడా ఈ షోకి వచ్చేసింది. ఇక ఈ ఎపిసోడ్ లో "బాయ్స్ హాస్టల్, లేడీస్ హాస్టల్ మధ్య పోటీ" అనే కాన్సెప్ట్ తో శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ ని రెడీ చేశారు. ఇందులో డ్యాన్స్ పెర్ఫామెన్స్, ఆటపాటలతో జబర్దస్త్ కమెడియన్లు అదరగొట్టారు. ఆటో రాంప్రసాద్, నరేష్, బులెట్ భాస్కర్, రోహిణి కామెడీ టైమింగ్ ఆకట్టుకుంది. అలాగే కొందరు జానపద పాటలు పాడి సందడి చేశారు. రోహిణి అయితే భీమ్లా నాయక్ సాంగ్ కి దుమ్ము దులిపేసింది. అర్జున్ దాస్, అనికా సురేంద్రన్ వేదికపైకి రాగానే.. "చిన్నారి తల్లి చిన్నారి తల్లి" అంటూ పాటతో ఆటో రాంప్రసాద్ ఇన్వైట్ చేసాడు. అర్జున్ దాస్ వాయిస్ కి తాను పెద్ద ఫ్యాన్ అని తెలిపాడు. అర్జున్ దాస్ మ్యూజికల్ చైర్ గేమ్ లో బుల్లితెర నటి నవ్య స్వామిని ఎత్తుకుని ఈ గేమ్ ఆడాడు. "ఆమెని ఎత్తుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి" అని రాంప్రసాద్ అడిగేసరికి అర్జున్ దాస్ "గుడ్ వర్కౌట్" అని ఆన్సర్ ఇచ్చాడు.  అయితే మీ వర్కౌట్ ని పెంచుతాను అంటూ  రోహిణిని పిలిచాడు రాంప్రసాద్. 

ఇక తప్పక అర్జున్ దాస్ రోహిణిని ఎత్తుకుని చైర్స్ చుట్టూ తిరిగాడు. వెంటనే యాంకర్ రష్మీ స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చి "రోహిణి.. ఈయన నీ బరువు మోశాడు.. బాధ్యతలు కూడా మోస్తాడు" అని రష్మీ చెప్పింది. ఆ మాటలకు రోహిణి అర్జున్ వైపు చాలా ప్రేమగా చూడడం ఆయన రోహిణిని చూసి దణ్ణం పెట్టే  సీన్ నవ్వులు  పూయించింది.