English | Telugu

తమ్ముడు అన్నప్పుడే నాలో ఆర్టిస్ట్ చచ్చిపోయాడు

ఎక్స్ట్రా జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమో మంచి కలర్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో ఖుష్భు కూడా ఒక స్కిట్ లో పార్టిసిపేట్ చేశారు. ఖుష్భు ఎక్కువ బులెట్ భాస్కర్ తో కలిసి స్టెప్పులేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తారు. కానీ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ లో ఆమె బులెట్ భాస్కర్ స్కిట్ లో కమెడియన్ గా చేశారు. ఆ స్కిట్ లో ఆమె అన్న మాట విని బులెట్ భాస్కర్ చాల హర్ట్ అయ్యాడు.

భాస్కర్ హీరోగా చేస్తుండగా ఖుష్భు హీరోయిన్ అనుకుని చాలా హ్యాపీగా ఉన్నాడు. కానీ కుష్బూ వచ్చి "తమ్ముడు నేను మార్కెట్ కి వెళ్తే అక్కడ ఎవడో వచ్చి నా చేయి పట్టుకున్నాడు తమ్ముడు..నువ్వు ఎదో ఒకటి చెయ్యి " అంటూ తెగ ఏడ్చేసారికి భాస్కర్ నోటి వెంట మాటే రాలేదు. "అంత ప్రేమగా అడుగుతుంటే ఏదో ఒకటి చెయ్యండి సర్" అని మరో కమెడియన్ భాస్కర్ ని అడిగేసరికి " తమ్ముడు అన్నప్పుడే నాలో ఆర్టిస్ట్ చచ్చిపోయాడు" అని కళ్ళజోడు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.

ఇక దొరబాబు-ఆటో రాంప్రసాద్ స్కిట్ లో దొరబాబు రాకెట్ లో వెళ్తూ సిగరెట్ కాల్చటంతో రాంప్రసాద్ కి కోపం వచ్చేసింది. "రాకెట్ లో సిగరెట్ కాలుస్తావేంటి" అనేసరికి "నీ రాకెట్ లోంచి అంత పొగ వస్తుంటే కనిపించడం లేదు కానీ నా సిగరెట్ పొగ కనిపిస్తోందా నీకు" అనేసరికి అందరూ నవ్వేశారు. ఐతే ఈ వారం అన్ని స్కిట్స్ లోకి భాస్కర్, రాంప్రసాద్ స్కిట్స్ కొంచెం ఎంటర్టైన్ చేస్తాయేమో అని ఈ ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది. ఐతే నెటిజన్స్ మాత్రం కొన్ని టీమ్స్ ని తీసేసి మళ్ళీ సుడిగాలి సుధీర్ ని, చమ్మక్ చంద్ర టీమ్స్ ని తీసుకొచ్చి స్కిట్స్ చేయిస్తే బాగుంటుంది అంటున్నారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.