English | Telugu

రష్మిని అసలు నువ్వెవరు ? అని అడిగిన బులెట్ భాస్కర్ నాన్న

బుల్లితెరపై మస్త్ పాపులర్ ఐన షో జబర్దస్త్ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ. స్టార్ట్ చేసిన కొంత కాలానికే మంచి పేరు తెచ్చుకుంది. సుధీర్ హోస్ట్ గా స్టార్ట్ ఐన షో ఇప్పుడు రష్మీతో కంటిన్యూ అవుతోంది. మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించడమే కాదు అప్పుడప్పుడు ఎమోషషనల్ సబ్జక్ట్స్ తో ఆడియన్స్ ని కంటి తడి పెట్టిస్తూ ఉంది ఈ షో. ప్రతీ ఆదివారం మధ్యాహ్నం ప్రతీ ఇంటిని పలకరిస్తూ అలరిస్తోంది ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఈ వారం పెళ్ళాం చెబితే వినాలి థీమ్ తో స్కిట్స్ ప్లాన్ చేశారు కమెడియన్స్. ఈ ప్రోమోలో ఐతే ఆది మిగతా కమెడియన్స్ వచ్చి సందడి చేసినట్టు కనిపిస్తుంది. ఈ స్టేజి మీద భార్యలకు, భర్తలకు కబడ్డీ పోటీ పెడతారు. ఈ గేమ్ లో బులెట్ భాస్కర్ వాళ్ళ నాన్న కూడా పార్టిసిపేట్ చేస్తారు. అప్పటివరకు సరదాగా రష్మీ ని ఆట పట్టిస్తూ పంచ్ డైలాగ్స్ తో కాస్త ఎక్కువ చేస్తాడు.

బులెట్ భాస్కర్ ఈ మధ్య కొన్ని ఎపిసోడ్స్ లో వాళ్ళ నాన్నను స్టేజి మీదకు తీసుకొచ్చి కామెడీ స్కిట్స్ చేయిస్తున్నారు. ఆయన టైమింగ్ ఉన్న కామెడీ చేస్తున్నారు కానీ కొన్ని పేలుతున్నాయి కొన్ని ఫ్లాప్ అవుతున్నాయి. ఆయన రష్మీ మీద కూడా ఇలాంటి డైలాగ్స్ వేస్తుంటే ఏమనాలో అర్ధం కాక తెల్లమొహం వేసుకుని నిలబడుతుంది. ప్రతీ కాంపిటీషన్ లో లేడీస్ గెలుస్తున్నారు, మగవాళ్ళు ఓడిపోతున్నారు అంటూ రష్మీ అనేసరికి మైక్ అందుకున్న బులెట్ భాస్కర్ వాళ్ళ నాన్న అసలు మీరు ఎవరు ? ఏం మాట్లాడుతున్నారో నాకు అర్ధం కావడం లేదు.. అని కామెంట్ కం అవమానం చేసేసరికి రష్మీ ఒక్కసారిగా షాక్ ఐపోతుంది.

ఇక కబడ్డీ గేమ్ లో ఈయన కూతకు వెళ్లి స్టేజి మీద జారిపోయే పడిపోయాడు. ఈ ఘటనతో అక్కడున్న వాళ్లంతా కాస్త టెన్షన్ అవుతారు. భాస్కర్ వాళ్ళ నాన్న పట్టు తప్పి పడిపోయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

Jayam serial : పారు వేసిన ప్లాన్.. గంగని అపార్థం చేసుకున్న రుద్ర!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -140 లో..... పెళ్లి అయి మొదటిసారి ఇంటికి వచ్చిన అల్లుడు కూతురికి లక్ష్మి మర్యాదలు చేస్తుంది. రుద్రకి వరుస అయ్యోవాళ్ళు ఒక ఆటాడుకుంటారు. నల్లపూసల కార్యక్రమం అయ్యాక శోభనానికి ఏర్పాట్లు చేస్తారు. ఇద్దరికి బంతాట ఆడిపిస్తారు. బిందెలో రింగ్ తీయిస్తారు. ఇద్దరు సరదాగా ఉంటారు. రుద్ర వంక గంగ చూస్తుంటే.. ఏంటి చూస్తున్నావ్ వెళ్లి కింద పడుకోమని రుద్ర అంటాడు. ఆ తర్వాత రుద్ర, గంగ సరదాగా బాక్సింగ్ చేస్తుంటారు. అప్పుడే రుద్ర కాలికి సెల్ఫీ స్టిక్ తగులుతుంది. అది రౌడీ చేత పారు పెట్టిస్తుంది.