English | Telugu

నువ్వు నేను ప్రేమ సీరియల్ లో బ్రహ్మముడి కావ్య, రాజ్!

తెలుగు సీరియల్స్ లో స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ కి క్రేజ్ ఎక్కువే ఉంది. ఎందుకంటే వీటిలో కార్తీక దీపం2, బ్రహ్మముడి, గుప్పెడంత మనసు లాంటి సూపర్ హిట్ సీరియల్స్ ప్రసారమవుతున్నాయి. ఇవి తెలుగు ప్రజలకి ఎంతగానో నచ్చేవిగా అత్యధిక టీఆర్పీని సొంతం చేసుకుంటున్నాయి.

బ్రహ్మముడి సీరియల్‌లో కావ్యగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన దీపికా రంగరాజు. తన యూట్యూబ్ ఛానల్‌ రకరకాల వీడియోలను షేర్ చేస్తూ బిజీగా మారింది. బ్రహ్మముడి సీరియల్‌తో బాగా పాపులర్ కావడంతో.. దీపిక యూట్యూబ్ ఛానల్‌ అతి తక్కువ కాలంలోనే 97 వేల మంది సబ్ స్క్రైబర్స్‌ని సంపాదించింది దీపిక. ఇక యూట్యూబ్ ద్వారా మంచి ఇన్‌కమ్ జనరేట్ కావడంతో.. ఫుల్ ఫోకస్డ్‌గా తన యూట్యూబ్ ఛానల్‌లో బ్యూటీ, హెల్త్, పర్సనల్ ఇలా రకరకాల వీడియోలను షేర్ చేస్తుంది. తాజాగా కావ్య తన యూట్యూబ్ ఛానెల్ లో " నువ్వు నేను ప్రేమ సీరియల్ లో వన్ ఫన్ డే " అనే వ్లాగ్ చేసింది. ఇందులో ఆ సీరియల్ లోని పద్దు, విక్కీలతో కలిసి మాట్లడుతూ సరదాగా ఎంజాయ్ చేసింది. ఫుల్ పంచులతో నవ్వుతూ అందరిని నవ్వించేస్తోంది కావ్య అలియాస్ దీపిక. కాగా నువ్వు నేను ప్రేమ సీరియల్ లో పద్దు, విక్కీల వెడ్డింగ్ పార్టీ ఉందని, దానికోసం బ్రహ్మముడి కావ్య, రాజ్ లు వెళ్ళారని అది స్పెషల్ ఎపిసోడ్ అని ముందే చెప్పేసింది కావ్య. ఇక అక్కడ షూటింగ్ ఎలా ఉండబోతుందో కొన్ని బైట్స్ ఈ వ్లాగ్ లో చూపించింది. దాంతో ఈ సీరియల్ అభిమానులతో పాటు‌ నెటిజన్లు ఈ వీడియోని తెగ చూసేస్తున్నారు.

బ్రహ్మముడి సీరియల్ లో కావ్య రాజ్ ల జోడికి అభిమానులు కూడా ఎక్కువే. అయితే కావ్య తమిళ అమ్మాయి. తనకి ఈ సీరియలే మొదటిది. కానీ ప్రస్తుతం తను తెలుగు నేర్చుకుంటూ వ్లాగ్స్ తెలుగులోనే చేస్తుంది. ఇక ఢీ షోలో, స్టార్ మా పరివారం షోలో తన కామెడీతో అందరిని కడుపుబ్బా నవ్వించేస్తుంది. బ్రహ్మముడి సీరియల్ తో వచ్చిన గుర్తింపు కంటే కూడా వీకెండ్ లో వచ్చే స్పెషల్ షోలలో దీపిక కామెడీకి ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.